కరోనాతో వైసీపీ సీనియర్ నేత మృతి

Update: 2020-11-08 11:30 GMT
ఏపీలో కరోనా కోరలు చాస్తోంది. విశృంఖంలంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే మంత్రులు, నేతలు, అధికారులు కరోనా బారినపడ్డారు.   పలువురు చనిపోయారు కూడా.. ఇప్పటికే తిరుపతి ఎంపీ ఇదే కరోనా సైడ్ ఎఫైక్ట్ లతో మృతిచెందడం విషాదం నింపింది.

ఈ క్రమంలోనే తాజాగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వైసీపీలో విషాదం అలుముకుంది. సీటీ వైసీపీ అధ్యక్షుడు ఫ్రూటీ కుమార్ అనారోగ్యంతో కన్నుమూయడం పార్టీలో విషాదం నింపింది.

ఫ్రూటీకుమార్ గత కొంత కాలంగా కరోనా సోకడంతో విశాఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో  తుదిశ్వాస విడిచారు.  

కొద్దిరోజుల క్రితం సీఎం వైఎస్ ఈయన ఆరోగ్య పరిస్థితిపై స్వయంగా ఫోన్ చేసి ఆరాతీశారు. వైసీపీ ఆవిర్భావం నుంచి ఫ్రూటీ కుమార్ పార్టీలో బలోపేతం కోసం కృషి చేశారు. ఆయన మరణం పట్ల పార్టీ నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. రికవరీ రేటు పెరిగింది. మరణాల సంఖ్య తగ్గింది.
Tags:    

Similar News