న‌ష్టాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు... టీడీపీతో ట‌చ్‌లోకి వ‌స్తున్నారా ?

Update: 2021-07-24 14:30 GMT
జ‌గ‌న్ కోసం, వైసీపీ కోసం ఎంతో మంది నేత‌లు సంవ‌త్స‌రాలుగా క‌ష్ట‌ప‌డుతున్నారు. జ‌గ‌న్ కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడే అప్ప‌టికే కీల‌క ప‌ద‌వుల్లో ఉన్న వారు ప‌దవుల‌తో పాటు నాడు కాంగ్రెస్ పార్టీని వ‌దులుకుని మ‌రీ బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఒక్క కాంగ్రెస్ పార్టీ నుంచే కాదు... టీడీపీలో ఎమ్మెల్యేలుగా ఉన్న ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డి లాంటి నేత‌లు కూడా త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేసి వైసీపీలోకి వ‌చ్చేశారు. ఇది జ‌రిగి ప‌దేళ్లు అవుతోంది.

అదే ప్ర‌స‌న్నకుమార్ రెడ్డి అప్పుడూ ఎమ్మెల్యేనే... ఇప్పుడూ ఎమ్మెల్యేనే... ఆయ‌న‌కు వైసీపీలోకి రావ‌డం వ‌ల్ల ఒరిగింది ఏంట‌న్న‌ది చూసుకుంటే జీరోనే అని చెప్పాలి. ఆయ‌న అదే టీడీపీలో ఉండి ఉంటే ఖ‌చ్చితంగా  సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి ప్లేసులో గ‌త ప్ర‌భుత్వంలో మంత్రి అయ్యేవారే..! ప‌దేళ్ల పాటు ఎన్నో క‌ష్ట‌న‌ష్టాల‌తో పాటు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ప‌డినా ప్ర‌స‌న్న‌కుమార్‌కు ఒరిగింది శూన్యం.

ఇది ఒక్క ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డి గురించి మాత్ర‌మే చెపుతోంది కాదు.. ఆయ‌న ఒక ఉదాహ‌ర‌ణ మాత్ర‌మే..! చంద్ర‌బాబు ప‌దేళ్లు ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు కూడా చాలా మంది టీడీపీ నేత‌లు ఇలాంటి ఇబ్బందులే ప‌డ్డారు. అధికారంలోకి వ‌చ్చాక ఐదేళ్లు మాత్రం ఫుల్లుగా దండుకున్నారు. ఇసుకతో మొద‌లు పెడితే మ‌ద్యం దుకాణాలు, మట్టి ఇత‌ర వ్యాపారాలు ఇలా అన్నింట్లోనూ బాగానే లాగుకున్నారు.

అయితే అక్క‌డ అవినీతి మ‌రీ ఎక్కువ అవ్వ‌డం కూడా టీడీపీ ఓట‌మికి ఓ కార‌ణ‌మే. అయితే ఇది వేరే సంగ‌తి. కానీ టీడీపీ నేత‌లు మాత్రం ప‌దేళ్లు ప్ర‌తిప‌క్షంలో ఉన్నా ఐదేళ్ల‌లో కాస్త సెటిల్ అయిపోయారు. త‌మ భ‌విష్య‌త్ రాజ‌కీయానికి కూడా ఇబ్బంది లేకుండా సంపాదించుకున్నారు.

కానీ ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేల‌కు ఆ పరిస్థితి లేదు. ఇసుక రీచ్‌లు అన్ని స్థానికంగా ఎమ్మెల్యేల‌కు సంబంధం లేకుండానే కంపెనీకి ఇచ్చేయ‌డంతో వారు అందులో సంపాదించుకునే ప‌రిస్థితి లేదు. గ‌తంలో బాబు రహ‌దారులు, ఇత‌ర ప‌నుల అభివృద్ధికి ఇబ్బడి ముబ్బ‌డిగా నిధులు ఇచ్చేవారు.

అప్ప‌టి ఎమ్మెల్యేలు బినామీల‌తో ప‌నులు చేసేసుకుని భారీగా వెన‌కేసుకున్నారు. అయితే ఇప్పుడు ర‌హ‌దారులే కాదు.. అస‌లు అభివృద్ధికి నిధులు అడిగే ప్ర‌శ‌క్తే లేదు. ఇంకా చెప్పాలంటే ఎమ్మెల్యేల‌కు జ‌గ‌న్ అపాయింట్‌మెంట్ కూడా లేదు. కేవ‌లం సంక్షేమం పేరుతో నేరుగా ప్ర‌జ‌ల్లోకి కోట్లు వెళుతున్నాయే త‌ప్పా ఎమ్మెల్యేల‌కు ఏ మాత్రం ఉప‌యోగం లేదు.

ఎమ్మెల్యేలు న‌యా పైసా సంపాదించుకునే అవ‌కాశం కూడా జ‌గ‌న్ ఇవ్వ‌డం లేద‌న్న ఆవేద‌న వారిలో ఉంది. ఇక ప‌లువురు ఎమ్మెల్యేలు, ఎంపీల వ్యాపారాలు దెబ్బ‌తిన‌డం, నిర్మాణ రంగం కుదేలు కావ‌డం, గ‌త ఎన్నిక‌ల‌కు చేసిన అప్పులు తీర‌క‌, వ‌డ్డీలు పెరిగిపోతుండ‌డంతో ఎంపీలు అల్లాడిపోతున్నారు. త‌మ గోడును జ‌గ‌న్‌కు చెప్పుకునే ప‌రిస్థితి లేదు. స‌ల‌హాదారుల‌కు చెప్పినా వారు ఏదో ఒక‌టి చేద్దాం.. చూద్దాం అంటున్నారే త‌ప్పా ఏం చేయ‌డం లేదు. దీంతో వీళ్ల‌కు ప్రెజ‌ర్ పెరిగిపోతోంది.

ఈ క్ర‌మంలోనే గుంటూరు, కృష్ణా జిల్లాల‌కు చెందిన ఒక‌రిద్ద‌రు ఎమ్మెల్యేలు ఈ ప్రెజ‌ర్‌, అప్పుల బాధ‌లు ప‌డ‌లేక‌... వ‌చ్చే ఎన్నిక‌ల్లో మీ పార్టీ నుంచి సీటు ఇస్తామ‌ని హామీ వ‌స్తే .. టైం చూసుకుని మీ పార్టీలోకి వ‌చ్చేస్తామ‌ని టీడీపీతో ట‌చ్‌లోకి వెళ్లార‌ట‌. ఏదేమైనా జ‌గ‌న్ ఆదాయ మార్గాలు మ‌సేయ‌డంతో వైసీపీ నేత‌లు విల‌విల్లాడిపోతున్నారు. ఇది ఎన్నిక‌ల వ‌ర‌కు కొన‌సాగితే వైసీపీలో పెద్ద ముస‌లం త‌ప్ప‌దు ?
Tags:    

Similar News