బండబూతులు తిట్టిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే

Update: 2020-04-04 09:30 GMT
దేశవ్యాప్తంగా పటిష్టంగా లాక్‌ డౌన్‌ కొనసాగుతోంది. పక్కాగా స్వీయ గృహ నిర్బంధంలో ప్రజలు ఉన్నారు. దీనికి ప్రజలు పెద్ద ఎత్తున సహకరిస్తున్నారు. ప్రజలు అత్యాసవరమైతేనే బయటకు వస్తున్నారు. ఆ బయటకు వచ్చిన సందర్భంగా మాస్క్‌లు ధరిస్తూ.. ఒకరికొకరు భౌతిక దూరం పాటిస్తూ లాక్‌ డౌన్‌ నిబంధనలు  పక్కాగా అమలు చేస్తున్నారు. అయితే ప్రజాప్రతినిధులు మాత్రం నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ లో ఓ ఎమ్మెల్యే పని లేని పని పెట్టుకుని ఆర్బాటంగా ఓ పనిని ప్రారంభించారు. అయితే దీనిని నిలదీసిన మీడియాను ఆ ఎమ్మెల్యే బండ బూతులు తిట్టారు. ఈ సందర్భంగా ఆయన వ్యవహరించిన తీరు సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

లాక్‌ డౌన్‌ పక్కాగా కొనసాగుతున్న ఈ సమయంలో కల్వర్టు పనులను ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే మందీమార్బలంతో హాజరై ప్రారంభించారు. ఆర్బాటంగా పెద్ద సంఖ్యలో అతడి అనుచరులతో కలిసి ఆయన కార్యక్రమంలో పలమనేరు ఎమ్మెల్యే వెంకటేశ్‌ గౌడ పాల్గొన్నారు. కాలువపై ఓ దాత సహకారంతో నిర్మించిన కల్వర్టు పనులను ఆ ఎమ్మెల్యే పెద్ద సంఖ్యలో తన అనుచరులతో కలిసి ప్రారంభించారు. పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడదని నిబంధనలు ఉన్నా ఎమ్మెల్యే ఉల్లంఘించారు. అయితే ఈ విషయాన్ని కొన్ని మీడియా సంస్థలు ప్రచురించడంతో ఆ ఎమ్మెల్యే అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. ఆ మీడియా సంస్థలు ఎల్లో మీడియా అని ఆరోపిస్తూ తీవ్ర పదజాలంతో దూషించారు. ‘మీకు మానస్సాక్షి లేదా.. ఒకరి సంక నాకుతున్నారా? అని తీవ్రంగా మాట్లాడారు. ఇంకొంత రెచ్చరిపోయి మీ అమ్మ.. సోదరిసోదరులు ఉన్నారు.. అంటూనే మీ అ.. అ.. కు పుట్టి ఉంటే అంటూ పరుష పదజాలంతో వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రసారం చేసిన మీడియా సంస్థలపై ఆయన తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు.

అయితే ఎమ్మెల్యే వ్యవహారంపై ప్రజలు మండిపడుతున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలు పక్కాగా పాటించకుండా గుంపులుగుంపులుగా తిరగడమే కాకుండా నిబంధనలు పాటించాలని చెప్పిన మీడియాపైనే చిందులు తొక్కడం సరికాదని హితవు పలుకుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కూడా అభివృద్ధి కార్యక్రమాలు పక్కన పెట్టి కరోనా నివారణపై దృష్టి సారించారు. అయితే ఈ ఎమ్మెల్యే మాత్రం ఆ విధంగా చేయడంపై కొంత చర్చనీయాంశమైంది. అయితే ఆయన మాట్లాడిన మాటలు చాలా దారుణంగా ఉన్నాయి. పరుష పదజాలం ప్రయోగించడం చూస్తుంటే ఒక వీధి రౌడీ తీరుగా ఎమ్మెల్యే ప్రవర్తన ఉందని సోషల్‌ మీడియాతో పాటు పలమనేరు ప్రాంతంలో విమర్శలు వస్తున్నాయి. ఒక ఎమ్మెల్యేననే విషయం మరచి రౌడీగా వ్యవహరించడం సరికాదని మండిపడుతున్నారు. ఇలాంటి వ్యక్తులు ప్రజాప్రతినిధులు కావడం మన దురదృష్టమని కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారం ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లిందని సమాచారం. ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.


Full View
Tags:    

Similar News