సుబ్బయ్య హత్యతో సంబంధం లేదని వైసీపీ ఎమ్మెల్యే ప్రమాణం
కడప జిల్లా ప్రొద్దుటూరులో ఇటీవల జరిగిన టీడీపీ నేత సుబ్బయ్య దారుణ హత్య అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య పెద్ద విమర్శలకు దారితీసింది. ఈ హత్యను వైసీపీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డియే చేయించారని సుబ్బయ్య భార్య అపరాజిత ఆరోపించింది. దాంతో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు చెలరేగాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ , నేతలు ఈ హత్యపై తీవ్ర స్థాయిలో వైసీపీపై విరుచుకుపడ్డారు. లోకేష్ అయితే సుబ్బయ్య శవంతో ఆందోళన కూడా చేశాడు. వైసీపీ ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ క్రమంలోనే తీవ్ర ఆరోపణలపై వైసీపీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి స్పందించాడు. సుబ్బయ్య హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పాడు. అయినా ఆరోపణలు ఆగకపోవడంతో తాజాగా దైవ ప్రమాణం చేశాడు.
ప్రొద్దుటూరులోని సుబ్బిరెడ్డి కొట్టాల వద్దనున్న చౌడేశ్వరి దేవాలయంలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రమాణం చేశారు. తనకు సుబ్బయ్యను హత్య చేయించాల్సిన అవసరం లేదని ప్రమాణం చేశాడు. రాజకీయ లబ్ది కోసమే తనను వివాదంలోకి లాగుతున్నారని ఆరోపించాడు. కాగా సుబ్బయ్య హత్యకు తామే కారణమని ముగ్గురు వ్యక్తులు పోలీసుల ఎదుట ఇప్పటికే లొంగిపోయారు.
కాగా ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి దేవాలయంలో ప్రమాణంపై సుబ్బయ్య భార్య అపరాజిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్య చేయించి తప్పుడు ప్రమాణాలు చేస్తు్న్నారంటూ ధ్వజమెత్తారు. తప్పులు చేసి దేవుడి ముందు ప్రమాణం చేస్తే పాపం పోతుందా? అని ఫైర్ అయ్యారు. ఎఫ్ఐఆర్ కాపీ తమ చేతికి ఇవ్వకముందే ఎమ్మెల్యే, బీసీ కార్పొరేషన్ చైర్మన్ చేతుల్లోకి ఎలా వెళ్లిందని అపరాజిత ప్రశ్నించారు. తన భర్త ఫోన్ ఇంత వరకు బయటకు రాలేదని అన్నారు. హత్య కేసులో మున్సిపల్ కమిషనర్ అనురాధ పాత్ర కూడా ఉందని ఆమె ఆరోపించారు.
తన భర్త హత్య కేసులో న్యాయం జరిగే వరకు పోరాటం సాగిస్తానని అపరాజిత స్పష్టం చేశారు. రాజకీయాలకు తనకు సంబందం లేదని.. భవిష్యత్ లోనూ రాజకీయాల్లోకి రానని సుబ్బయ్య భార్య క్లారిటీ ఇచ్చారు.