వైసీపీ ఎమ్మెల్యే భర్త మృతి!!

Update: 2020-07-22 04:30 GMT
వైసీపీ ఎమ్మెల్యే ఇంట తీవ్ర విషాదం నెలకొంది.  శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి భర్త రెడ్డి నాగభూషణ రావు మృతి చెందారు.

ఢిల్లీలోని ప్రైవేట్ ఆస్పత్రిలో  నాగభూషణరావు అనారోగ్యంతో కొద్దిరోజులుగా చికిత్స పొందుతున్నారు. నిన్న పొద్దుపోయాక ఆయన మరణించినట్టు సమాచారం వచ్చింది.

పార్లమెంట్ లో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసి నాగభూషణరావు పదవీ విరమణ చేశారు.

ఇక నాగభూషణరావు మృతి పట్ల ఆ జిల్లా మంత్రి ధర్మాన కృష్ణదాస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన లేరనే విషయం తెలియగానే కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సానుభూతి తెలిపారు.ఏపీ సీఎం జగన్ సైతం ఆయన మృతికి సంతాపం తెలిపారు.
Tags:    

Similar News