స్వచ్చమైన స్వేచ్చా జీవిగా...

స్వేచ్చ స్వాతంత్ర్యం అవును. ఇవి మనిషికి కావాల్సిన ప్రాణవసరాలు. తినడానికి తిండి కట్టడానికి బట్ట ఉండడానికి బంగళా ఇచ్చినా కూడా సుఖం ఉండదు.;

Update: 2025-12-28 13:30 GMT

స్వేచ్చ స్వాతంత్ర్యం అవును. ఇవి మనిషికి కావాల్సిన ప్రాణవసరాలు. తినడానికి తిండి కట్టడానికి బట్ట ఉండడానికి బంగళా ఇచ్చినా కూడా సుఖం ఉండదు. ఎందుకంటే బంధీగా ఉండే బతుకు నరకం కాబట్టి. మరి ఏమి కావాలి అంటే స్వేచ్చ. హాయిగా ఎక్కడికైనా పాదం కదిపే స్వాతంత్ర్యం. నిజం చెప్పాలంటే దాని కోసమే కదా ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలు పోరాడాఅయి. మనిషికి స్వేచ్ఛ లేకపోతే అర నిముషం కూడా ఉండలేడు. మన రాజ్యాంగంలో కూడా వీటికే పెద్ద పీట వేసి మరీ అగ్ర తాంబూలం ఇచ్చాం.

రాజ్యాంగంలో పొందుపరచినవి :

ఇక మన భారత రాజ్యాంగం ప్రాథమిక స్వేచ్ఛకు పూర్తి హామీ ఇసోంది. ప్రధానంగా చూస్తే పార్ట్ త్రీ ఆర్టికల్స్ 12-35 కింద ఆరు కీలక హక్కులను నిర్వహిస్తోంది. అవి సమానత్వం, స్వేచ్ఛని నిర్దేశిస్తాయి. అంటే పౌరులకు వీటి ద్వారా ఎంతో స్వేచ్చతో కూడిన హక్కులు లభిస్తాయి. అలాగే మత స్వేచ్ఛ, సాంస్కృతిక స్వేచ్చ. విద్యా హక్కులు వంటివి ఉంటాయి. ఇక ఆర్టికల్స్ 19-22 ప్రత్యేకంగా ప్రసంగం చేసేందుకు అలాగే తన భావాలను వ్యక్తీకరణ చేసేందుకు ఎవరితో అయినా సమావేశం అయ్యేందుకు, అలాగే రాజ్యాంగానికి లోబడి సంఘాలను సంస్థలను ఏర్పాటు చేసేందుకు కూడా హక్కులు ఉన్నాయి. ఇలా భావ వ్యక్తీకరణ తో పాటు నచ్చిన విధంగా జీవించే హక్కు తమకు తోచిన వృత్తిని ఎన్నుకుని హాయిగా బతికే హక్కు కూడా రాజ్యాంగం ప్రసాదించింది.

బాధ్యతలు సైతం :

అయితే అంతా గమనించాల్సింది ఏంటి అంటే ప్రతీ హక్కు వెనక బాధ్యత కూడా ఉంది. హక్కు అందుకునేవారు బాధ్యతలను మోయాలి. మాట్లాడే హక్కు ఉంది కదా అని ఎదుటి వారిని దూషించడం తప్పు. అలాగే సమావేశాలు ఏర్పాటు చేసే హక్కు ఉంది కదా అని రాజ్యాంగం హితం కానివి చేస్తే కుదరదు, ఇక సభ్య సమాజంలో అంతా జీవిస్తున్నారు కాబట్టి వాటికి లోబడి తమ పరిధి, పరిమితి తెలుసుకుని మసలాలి. అక్కడే పౌరుల విజ్ఞత అన్నది ఆధారపడి ఉంటుంది. తినే తిండి కానీ కట్టే బట్ట కానీ ఇలా వ్యక్తిగత ఇష్టాలన్నింటికీ స్వేచ్చ ఉంది. అయితే బాధ్యతలు కూడా ఉంటాయై మరచిపోరాదు అని అంటున్నారు.

స్వేచ్చకు అసలైన నిర్వచనం :

నిజానికి స్వేచ్చ అంటే చాలా మంది భౌతికపరమైన విషయాలుగా భావిస్తున్నారు. వాటి మీదనే ఎక్కువగా వాదిస్తున్నారు. కానీ ఆలోచనలను కట్టి పడేసి మిగిలిన వాటిలో స్వేచ్చ ఇచ్చినా ఉపయోగం ఉండదు. మనిషి ఆలోచనలకు విలువ ఇవ్వడమే అసలైన స్వేచ్చగా భావించాలి. తాను ఏమి అనుకుంటున్నారో తన ఆలోచనలు ఏమిటో స్వేచ్చగా వ్యక్తీకరించే వాతావరణం ఉండాలి. బుర్రలో ఆలోచనలను ఎవరో ప్రభావితం చేస్తే ఆ స్వేచ్చకు అర్ధం పరధం ఉండదు. కేవలం కట్టు బొట్టు వీటి విషయంలోనే స్వేచ్చ ఉందనుకుని భ్రమపడితే ఎంతో కోల్పోయినట్లే లెక్క.

జైళ్ళలో ఉన్నా :

ఇక స్వాతంత్ర్యం పోరాటాన్ని ఒకసారి కనుక నెమరేసుకుంటే ఎంతో మంది వీరులు జైలు గోడల మధ్యన మగ్గారు వారంతా కూడా అక్కడ నిర్భంధించినా తమ స్వేచ్చను కోల్పోలేదు ఎలా అంటే మెదడుకు పని చెప్పడం ద్వారా. తమ ఆలోచనలను ఎక్కడా వారు దాచుకోలేదు, భయపడి వెనక్కి తగ్గలేదు. జైలు నుంచి కూడా తమ బలమైన వాణిని వినిపించారు. తమ కార్యాచరణను అక్కడ నుంచే ప్రకటించారు. ఇనుప ఊచలు సైతం వారిని ఏమీ చేయలేకపోయాయి. దాంతోనే స్వాతంత్ర ఉద్యమం సక్సెస్ అయింది.

బుర్రకు స్వేచ్చ ఇస్తే :

బ్రిటిష్ వారికి భారతీయుల అసలైన సామర్థ్యం ఏమిటో బాగా తెలిసింది. అందువల్ల స్వేచ్చ కోరేవారు అంతా తమ ఆలోచనలకు కోరుకోవాలి. తమదైన శైలిలో ఎవరి ప్రభావం లేకుండా కార్యాచరణను రూపొందించుకోవడానికి డిమాండ్ చేయాలి. అంతే తప్ప భౌతికపరమైన వాటి కోసం యాగీ చేయడం వల్ల ఉపయోగం లేదు బుర్రకు స్వేచ్చ ఇస్తే ఆటోమెటిక్ గా అన్ని రకాలైన స్వేచ్చ దానికదే వస్తుంది. ఇక ఏ హక్కు అయినా తీసుకునే ముందు బాధ్యత కూడా వెనకాలే ఉంటుందని గుర్తు పెట్టుకోవడం కూడా ఎవరూ మరవరాదు.

Tags:    

Similar News