మరోసారి ఎమ్మెల్యేగా పోటీచేయను: వైసీపీ ఎమ్మెల్యే
‘‘ఏదో చేయాలని ఎమ్మెల్యేను అయ్యాను.. ఏదో అయ్యింది. ఇక చాలు .. ఇంకోసారి ఓట్లు అడగను.. అసలు ఎమ్మెల్యేగా పోటీచేయను’’ అంటూ కర్నూలు జిల్లా నందికొట్టూర్ వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి విషయంలో తన మాట చెల్లకపోవడం.. మంత్రి అనిల్ రాజకీయ జోక్యం, కార్యకర్తల నిలదీతతో మనస్థాపం చెందిన వైసీపీ ఎమ్మెల్యే ఇలా ఎమ్మెల్యేగానే వచ్చేసారి పోటీచేయను అంటూ తన నిస్సహాయతను బయటపెట్టారు. దీంతో వైసీపీలో వర్గ విభేదాలు మరోసారి పొడచూపాయి.
నందికొట్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని తమకు కేటాయించకపోవడం.. తమకు సమాచారం ఇవ్వకుండానే వచ్చాడని కార్యకర్తలు ఎమ్మెల్యే ఆర్థర్ ను ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇంటింటికి ఓట్లు అడిగి గెలిపించామని.. కనీసం సమాచారం ఇవ్వరా అని ఎమ్మెల్యేను నిలదీశారు.
తననే నిలదీయడంతో ఎమ్మెల్యే ఆర్థర్ కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తను ఎవరి కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం లేదని.. బ్రతిమాలి కార్యక్రమాలకి పిలవను అని స్పష్టం చేశాడు. అధిష్టానం పట్టించుకోకపోవడం.. తన మాట నెగ్గకపోవడం.. కార్యకర్తలకు న్యాయం చేయకపోవడంతో ఇక తను ఎమ్మెల్యేగానే పోటీచేయను అని ఆర్థర్ నిర్ణయించుకోవడం వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఆర్థర్ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూలు జిల్లా నందికొట్కూరు నుంచి పోటీచేసి విజయం సాధించారు.గతంలో అసెంబ్లీలో చీఫ్ మార్షల్ గా విధులు నిర్వహించారు. తర్వాత వైసీపీలో చేరి ఎమ్మెల్యే అయ్యారు. అయితే ప్రస్తుతం పార్టీలో ప్రాధాన్యత దక్కక ఇలా బయటపడ్డారు.