వంగవీటి రంగా మర్డర్ వెనక ....?
వంగవీటి రంగా. ఆ పేరులోనే పవర్ ఉంది. ఇప్పటికి దాదాపుగా మూడున్నర దశాబ్దాల క్రితం విజయవాడ నడిబొడ్డున రంగా దారుణ హత్య జరిగింది. ఈ మధ్యలో ఎన్నో రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కానీ వంగవీటి రంగా హత్యను ఎవరూ విస్మరించలేదు. ఈ హత్య జరిగిన తరువాత ఒక నెల రోజుల పాటు విజయవాడ అగ్గి మీదనే ఉంది. ఇక ఏపీవ్యాప్తంగా నాడు జరిగిన అలజడి అంతకు ముందు కానీ ఆ తరువాత కానీ ఎన్నడూ జరగలేదు. ఇంతకీ వంగవీటి రంగా ఎవరు, ఆయన హత్య వెనక ఏంటి జరిగింది అన్నది ఈ తరానికి తెలియాల్సి ఉంది.
రంగా ఒకసారి కార్పోరెటర్ గా, ఒకసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు. అన్నింటికీ మించి ఆయన పేదల కోసం పాటుపడిన నేతగా గుర్తింపు పొందారు. సమస్యల మీద నిలబడి పోరాటం చేసిన లీడర్ గా విజయవాడలో ఎంతో గుర్తింపు ఉంది. ఇవన్నీ పక్కన పెడితే రంగాను 1988 డిసెంబర్ 25న దారుణంగా హత్య చేశారు. అప్పట్లో ఆయన ప్రజా సమస్యల మీద నిరాహారదీక్ష చేస్తూంటే అయ్యప్ప భక్తుల రూపంలో వచ్చిన వారు కొంతమంది ఆయనను దీక్షా శిబిరంలోనే దారుణంగా చంపేశారు.
రంగా హత్య ఎవరు చేశారు అన్న దాని మీద భిన్న వాదనలు ఉన్నా నాటి కాంగ్రెస్ కానీ నేటి వైసీపీ కానీ తెలుగుదేశం పార్టీ వారే ఆ హత్యను చేయించారు అని చెబుతుంది. రెండు కుటుంబాల మధ్య జరిగిన వివాదంగా దీన్ని టీడీపీ వారు చెప్పినా దీని వెనక రెండు సామాజిక వర్గాల సంఘర్షణ ఉంది. ఒక బలమైన సామాజికవర్గం అప్పటికే అధికారంలో ఉన్న టీడీపీతో కలసి ఉంటోంది. పైగా నాడు టీడీపీ ప్రభుత్వం ఎన్టీయార్ నాయకత్వాన పనిచేస్తోంది.
దాంతో రంగా హత్య విజయవాడ లాంటి నగరంలో నడి రోడ్డు మీద తెల్లవారుజామున జరిగింది అంటే కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యంగా ముందు చూడాలి. ఆ మీదట ఆయన ఒక ఎమ్మెల్యే, మరి ఎమ్మెల్యేకే రక్షణ ఇవ్వలేని చేతగాని ప్రభుత్వమా అన్న చర్చ కూడా నాడు వచ్చింది. మొత్తానికి ఏది ఏమైనా టీడీపీ నిర్వాకం వల్లనే రంగా చనిపోయారని ఈ రోజుకీ అంటారు. ఇపుడు అదే మాటను సీనియర్ మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అంటున్నారు.
రంగాను మర్డర్ చేసింది తెలుగుదేశం పార్టీకి చెందిన వారే అని ఆయన ఆరోపిస్తున్నారు. ఒక చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బొత్స మాట్లాడుతూ ఈ కీలకమైన కామెంట్స్ చేసారు. ఈ మాటను తాను అనడంలేదని, రంగా కుటుంబ సభ్యులతో పాటు చాలా మంది ఎన్నో సార్లు ఎన్నో వేదికల మీదన చెప్పారని కూడా గుర్తు చేశారు. మొత్తానికి చూస్తే రంగా హత్య వెనక టీడీపీ ఉందని పదే పదే వైసీపీ చెప్పడం వెనక రాజకీయ ప్రయోజనాలు కూడా ఉన్నాయని అంటున్నారు. రంగా బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన వారు. ఆ విధంగా టీడీపీకి కాంపులను దూరం చేయడంతో పాటు, జనసేనతో పొత్తు చిత్తు చేయించాలన్న ఆలోచనలు కూడా ఉన్నాయని చెబుతారు. ఏది ఏమైనా ఏనాడో జరిగిన రంగా హత్య ఈ రోజుకీ ఏపీ రాజకీయాలలో హాట్ హాట్ డిస్కషన్ గా మారడం అంటే నిజంగా విశేషమే అని చెప్పాలి.