వల్లభనేని వంశీ ఔట్!
వైసీపీ నేతల టంగ్ మారింది. నిన్న మొన్నటి వరకు తమతో అంటకాగిన ప్రతిపక్ష పార్టీ నేతలను తేడా కొట్టిందని తెలియగానే.. పక్కన పెట్టేస్తున్నారు. నిజానికి గత ఎన్నికలకు ముందు.. జంపింగులను ప్రోత్సహించేది లేదని.. వైసీపీ నేతలు బాహాటంగానే చెప్పుకొచ్చారు. చంద్రబాబు మాదిరిగా తాము పార్టీ దూకుళ్లను ప్రోత్సహించేది లేదన్నారు.
దీంతో అందరూ పరిశుద్ధమైన రాజకీయాలకు వైసీపీ నేతలు తెరదీశారని సంతోషించారు. ఇక, పార్టీకి కూడా 151 మంది ఎమ్మెల్యేలు లభించడంతో ఈ వాదన మరింత బలపడింది. అయితే.. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టీడీపీ ఎమ్మెల్యేలకు గేలం వేయడం ప్రారంభించారు.
ఈ క్రమంలో చీరాల, విశాఖ వెస్ట్, గుంటూరు వెస్ట్, కృష్ణాజిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యేలను తమకు అనుకూలంగా మార్చుకు న్నారు. సామ దాన భేద దండోపాయాలను ఉపయోగించి తమవైపు తిప్పుకొనే ప్రయత్నం చేశారు. అయితే.. కొందరు పడ్డారు. మరికొందరు కేసులకు భయపడకుండా.. వ్యవహరిస్తున్నారు.
ఇలా.. వైసీపీవైపు మళ్లిన కమ్మ నాయకుల్లో వల్లభనేని వంశీ ఒకరు. గన్నవరం నియోజకవర్గం నుంచి వరుస విజయాలు దక్కించుకోవడంతోపాటు.. దివంగత ఎన్టీఆర్ కుటుంబంతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో వైసీపీ ఈయనను పార్టీలోకి చేర్చుకోకుండా.. తమ నేతగానే అనదికారికంగా భావిస్తోంది.
ఇక, వైసీపీ నేతల అండ ఉండడంతో వల్లభనేని వంశీ కూడా తనదైన శైలిలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. వైసీపీ నేతల కనుసన్నల్లో ఆయన టీడీపీపైనా.. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లపైనా.. విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని రోజుల కిందట.. ఏకంగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని ఉద్దేశించి పరుషంగా వ్యాఖ్యానించారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేగింది.
ఇక, ఇది అసెంబ్లీ వరకు పాకడం.. చంద్రబాబును నిండు సభలో అవమానించా రంటూ.. టీడీపీ నేతలు ఆందోళనకు దిగడం.. చంద్రబాబు కన్నీరు పెట్టడం తెలిసిందే. ఈ వ్యవహారం కాస్తా.. మహిళల్లోకి వెళ్లింది. దీంతో వైసీపీ నేతల వ్యవహారంపై తీవ్రస్థాయిలో మహిళలు ఆందోళన, ఆవేదన వ్యక్తం చేయడం కనిపించింది.
ఫలితంగా ఇప్పటి వరకు ఏ ఓటు బ్యాంకును నమ్ముకుందో.. వైసీపీకి అదే ఓటు బ్యాంకుపై బెంగ పట్టుకుంది. భువనేశ్వరి వ్యాఖ్యలను చంద్రబాబు సతీమణిపై చేసిన వ్యాఖ్యలుగా చూడడంతోపాటు.. నందమూరి కుటుంబంలోని ఆడపడుచుపై చేసిన వ్యాఖ్యలుగా మహిళలు భావించారు. దీంతో వైసీపీకి మహిళల నుంచి సెగ ప్రారంభమైంది.
దీంతో వెంటనే రంగంలోకి దిగిపోయిన.. వైసీపీ కీలక ఎమ్మెల్యేలు.. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వంటి ఎమ్మెల్యేలు.. భువనేశ్వరిని తాము ఏమీ అనలేదన్నారు. ఈ క్రమంలో రాచమల్లు మరో అడుగు ముందుకు వేసి.. అసలు వంశీ అనే నాయకుడు తమ నేత కాదని.. ఆయనకు తమకు సంబంధం ఏంటని ప్రశ్నించారు.
టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న వంశీ.. ఏదో అంటే.. తమకు ఎలా ఆపాదిస్తారని.. ఆయన ప్రశ్నించారు. కట్ చేస్తే.. ఈ మొత్తం ఎపిసోడ్‌లో వైసీపీకి సెగ తగిలే సరికి ఇప్పుడు వంశీని పక్కన పెట్టేస్తున్నారనే వాదన బాహాటంగానే వినిపిస్తోంది.
దీంతో ఇప్పుడు వంశీ రాజకీయ భవితవ్యంపైనే తీవ్ర ప్రశ్నలు వస్తున్నాయి. అటు టీడీపీని ఎదిరించి, చంద్రబాబుపైనా.. లోకేష్‌పైనా.. ఇటు భువనేశ్వరిపైనా కామెంట్లు చేసి ఆపార్టీకి దూరమైతే.. ఆయన నమ్ముకున్నపార్టీ వైసీపీ ఇప్పుడు ఆయనను దూరం పెట్టింది. దీంతో ఇక, వంశీ రాజకీయాలు ఔట్! అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.