ట్రంప్ ఆ దేశం చేతిలో ఓడిపోయారు

Update: 2017-04-27 10:53 GMT
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కు ఊహించ‌ని ప‌రాభ‌వం ఎదురైంది. మెక్సికోతో జరుగుతున్న వాణిజ్య పోరులో ట్రంప్‌ ప్రభుత్వం పరాజయం పాలైంది. అమెరికాపై 163 మిలియన్ల డాలర్ల మేరకు వాణిజ్య ఆంక్షలను విధించడానికి అనుమతిస్తూ ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఓ) మెక్సికోకు అనుకూలంగా రూలింగ్‌ ఇచ్చింది. మెక్సికన్‌ టునా చేపలపై అమెరికా అక్రమంగా విధించిన ఆంక్షల వల్ల మెక్సికో పెద్ద మొత్తంలో నష్టపోయిందని డబ్ల్యుటిఓ పేర్కొంది.

అమెరికా-మెక్సికో దేశాల మధ్య ఏళ్ళ తరబడి ఈ వివాదం నడుస్తోంది. టునా చేపలు పట్టడం కోసం డాల్ఫిన్లను చంపరాదని, అలా వాటిని చంపి పట్టే టునా చేపలను అమెరికా మార్కెట్లో విక్రయించరాదని అమెరికా పట్టుబడుతోంది. అయితే తమ జాలర్లు నిబంధనలకు కట్టుబడే వ్యవహరిస్తున్నారని మెక్సికో ప్రభుత్వం పేర్కొంటోంది. కానీ అమెరికా ప్రభుత్వం అందుకు అంగీకరించడం లేదు. ఈ వివాదం డబ్ల్యుటిఓ దృష్టికి వెళ్లింది. దీంతో అమెరికా వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ మెక్సికోకు అనుకూలంగా రూలింగ్‌ ఇచ్చింది. అమెరికా - మెక్సికో, కెనడాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై తిరిగి చర్చించాలని ట్రంప్‌ ప్రభుత్వం భావిస్తున్న తరుణంలోనే ఈ రూలింగ్‌ రావడం యాధృచ్ఛికం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News