రెజ్లర్ సుశీల్ కుమార్ తన మర్డర్ ను వీడియో తీయించాడు: పోలీసులు

Update: 2021-05-24 07:30 GMT
రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత రెజ్లర్ సుశీల్ కుమార్ అరెస్ట్ నిన్న సంచలనం సృష్టించింది. హత్య కేసు గురించి మరిన్ని వివరాలను పోలీసులు తాజాగా వెల్లడించారు. గత 20 రోజులుగా సుశీల్ కుమార్ ఎలా పరారీలో ఉన్నారు అనేది వివరించారు. తన ప్రతాపం చూపించేందుకు.. తనంటే అందరూ భయపడేందుకు ఏకంగా దాడి ఘటనను వీడియో తీసి వైరల్ చేయాలని సుశీల్ సూచించాడని పోలీసులు తెలిపారు.

ఢిల్లీలోని ఛత్రసల్ స్టేడియంలో తోటి రెజ్లర్ సాగర్ రానా (23) హత్య కేసులో నిందితుడైన సుశీల్ కుమార్ 20 రోజుల పాటు పరారీలో ఉన్నాడు.  ఢిల్లీలోని రెజ్లింగ్ సర్క్యూట్‌లో సాగర్ ను  సుశీల్ స్నేహితులతో కలిసి దాడి చేయగా.. చికిత్స పొందుతూ అతడు చనిపోయినట్లు కేసు నమోదు చేసినట్లు తెలిసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుశీల్ తన స్నేహితుడు ప్రిన్స్ ను తమ దాడిని వీడియో తీయమని కోరాడు. సుశీల్ మరియు అతని సహచరులు బాధితులపై దాడి చేశారు. ఈ వీడియోతో తన భయాన్ని రెజ్లింగ్ సమాజంలో సుశీల్ స్థాపించాలని అనుకున్నాడట..  మే 4 న సుశీల్ కుమార్ మరియు అతని సహచరులు సాగర్ రానా మరియు అతని ఇద్దరు మిత్రులపై దాడి చేశారు. ముగ్గురూ ఆసుపత్రి పాలయ్యారు. తరువాత సాగర్ రానా గాయాలతో మరణించారు. సుశీల్ కుమార్‌తో పాటు అతని సహ నిందితుడు అజయ్‌ను ఢిల్లీలోని ముండ్కా ప్రాంతంలో పోలీసులు అరెస్టు చేశారు.

సుశీల్‌ను 6 రోజుల పోలీసు కస్టడీకి పంపారు. హత్యకు గురైన రెజ్లర్ సాగర్ రానా తండ్రి సుశీల్ కుమార్ కు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. సుశీల్ కుమార్ అరెస్ట్ నుండి తప్పించుకునేందుకు గత 15 రోజులలో ఏడు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల సరిహద్దులను దాటాడు. పోలీసులకు దొరకకుండా ప్రయత్నంలో అతను నిరంతరం తన సిమ్ కార్డులను మార్చుకున్నాడు. సుశీల్ కుమార్ ఉత్తరాఖండ్ లోని రిషికేశ్ వెళ్లి ఒక ప్రసిద్ధ పవిత్ర వ్యక్తి ఆశ్రమంలో బస చేసినట్లు పోలీసులు కనిపెట్టారు.
Tags:    

Similar News