భారత్ లో పేలిన రెండో ప్రపంచ యుద్ధం బాంబు?

Update: 2020-09-09 06:30 GMT
రెండో ప్రపంచ యుద్ధం నాటిదిగా భావిస్తున్న బాంబు ఒకటి తాజాగా పేలింది. ఊహించని ఈ పరిణామంతో ఒకరు అక్కడిక్కడే మరణించారు. నాగాలాండ్ రాష్ట్రంలోని దిమాపూర్ జిల్లాలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. తుక్కును సేకరించే ఒక వ్యక్తి ఇనుప వస్తువుగా భావించి.. ఆ బాంబును తీసుకున్నాడు దాన్ని పగలకొట్టేందుకు సుత్తితో చాలాసేపు అదే పనిగా కొట్టాడు.దీంతో.. ఆ బాంబు ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఈ ఘటనలో సదరు వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. అతడు నివసిస్తున్న ఇల్లు సైతం పాక్షికంగా దెబ్బ తింది. ఈ ఉదంతంలో నలుగురు గాయపడ్డారు. అందులో ఒక మహిళ ఉన్నారు.

స్థానిక బర్మా క్యాంప్ లో ఈ ఘటన జరిగినట్లుగా చెబుతున్నారు. బాంబు పేలుడు సమాచారం విన్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. బాంబు పేలుడు ఘటనలో గాయపడిన వారిని ఇరుగుపొరుగు వారు తరలిస్తున్నారు. ఈ ఉదంతంపై పూర్తి విచారణను చేపట్టారు.
Tags:    

Similar News