చైనా కు కరోనా దెబ్బ.. భారత్ కు వరం
ప్రస్తుతం ప్రమాదకర దేశంగా చైనాను ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. కరోనా వైరస్ ప్రబలడం విశ్వరూపం చూపి పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. అయితే మళ్లీ ఇటీవల కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో ఆ దేశం అంత యోగ్యమైన ప్రదేశం కావాలని వివిధ సంస్థలు భావిస్తున్నారు. దీంతో చైనాకు వ్యాపార పరంగా తీవ్ర దెబ్బ తగులుతోంది. ఈ నేపథ్యం లో చైనాలో ఉన్న కంపెనీలన్నీ ఇతర దేశాలకు తరలిపోవాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలో ఆ సంస్థలు, కంపెనీలకు భారతదేశం అత్యంత అనుకూల ప్రదేశమని గుర్తిస్తున్నాయి. ఇదే విషయాన్ని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ)ల విషయంలో భారత ప్రభుత్వం ఇటీవల నిబంధనలు సవరించింది. అయితే దీనిపై వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూటీఓ) సూత్రాలను ఉల్లంఘించిందని, ఫ్రీ అండ్ ఫెయిర్ ట్రేడ్‌కు విరుద్ధంగా భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆ సమయం లో చైనా తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసిందని గుర్తుచేశారు. ఆ సవరణలు చేయడంతోనే ఇప్పుడు చైనాను కాదని భారత్ వైపు కంపెనీలు చూస్తున్నాయని వెల్లడించారు.
చైనా సూపర్ ఆర్థికంగా శక్తివంతమైన దేశం ఐనప్పటికీ ప్రస్తుతం చాలా దేశాలు ఆ దేశంతో వాణిజ్యం చేయడానికి ఇష్టపడడం లేదని మంత్రి తెలిపారు. ఈ పరిణామం భారతదేశానికి ఒక వరమని పేర్కొన్నారు. ఇది మనకు ఒక అవకాశమని, 2025 నాటికి భారతదేశాన్ని5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయాన్ని నెరవేర్చడానికి ఇది ఒక అవకాశంగా ఉంటుందని వెల్లడించారు. కొత్త టెక్నాలజీని పెట్టుబడులుగా మార్చడానికి ఓ సంయుక్త కార్యదర్శిని నియమిస్తామని తెలిపారు. వీటితో పాటు మరికొన్ని అంశాలపై కేంద్రమంత్రి మాట్లాడారు. ఐఎంఎఫ్ ఈ సంవత్సరం భారతదేశానికి 1.9 శాతం వృద్ధి రేటును అంచనా వేసిందని, దీంతో 2021లో చైనా, భారతదేశం రెండూ బలంగా పుంజుకుంటాయని అంచనా వేసినట్లు వెల్లడించారు.