వామ్మో.. వాయ్యో.. కరోనా అని తెలిసి ఏడ్చేసిన మహిళ

Update: 2020-07-04 02:30 GMT
కరోనా.. క్యా కరోనా అన్నట్టే ఉంది. ఈ మహమ్మారి రాకూడదని ఉద్యోగాలు, పనులు బంద్ చేసి ఇంట్లో కూర్చున్న ఎవరి ద్వారానో మనకు వచ్చి పడుతోంది. ఇప్పుడు కరోనా నుంచి తప్పించుకోవడమే పెద్ద టాస్క్ గా మారింది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి సోకకూడదని అందరూ జాగ్రత్తగా ఉంటున్నారు. చైనాలోనూ ఓ మహిళ ఇలాగే ఉంది. కానీ కరోనా పాజిటివ్ అని తెలియగానే గుండెలు బాదుకుంది. ఆ వీడియో వైరల్ గా మారింది.

చైనాలోని బీజింగ్ షిజింగ్షాన్ వాండా ప్లాజాలో ఒక మహిళ ఫోన్ మాట్లాడుతూ ఒక్కసారిగా పెద్ద అరుస్తూ ఏడుస్తూ తనకు కరోనా వచ్చిందని పెడబొబ్బలు పెట్టింది. ఆమె అరుపులకు అక్కడున్న వారు భయాందోళనతో అక్కడి నుంచి పరారయ్యారు. కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ అయ్యింది.

మహిళ ఫోన్లో కూలబడి ఏడుస్తూ వాపోయిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

వీడియో కోసం క్లిక్ చేయండి..
Full View
Tags:    

Similar News