తొమ్మిది పెళ్లిళ్లు చేసుకున్న పతివ్రత ... చివరికి హతం , వెలుగులోకి సంచలన నిజాలు !

Update: 2020-07-29 06:30 GMT
నేటి సమాజంలో వివాహనికి ఉన్న గౌరవం రోజురోజుకి మసకబారుతుంది. ఎంతోమంది భార్య , భర్తలు వివాహా సంబంధానికి తగిన గౌరవం ఇవ్వకుండా అక్రమ సంబంధాల బాట పట్టి , అన్యాయంగా మధ్యలోనే తనువు చాలిస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. భార్య చేష్టలతో విసిగిపోయిన ఓ భర్త  గొంతు కోసి భార్య‌ను దారుణంగా చంపేశాడు. ఆ తరువాత స్వయంగా వెళ్లి పోలీసులకి లొంగిపోయాడు.  అయితే ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ చేస్తోన్న పోలీసులకు దర్యాప్తులో అసలు విష‌యాలు తెలియడం తో పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. ఆ మహిళకి తొమ్మిది పెళ్లిళ్లు అయ్యాయ‌ని, తొమ్మిదో భ‌ర్త చేతిలో హత్య‌కు గురైంద‌ని విచారణలో వెల్లడింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన నాగరాజు మూడేళ్లు గా రంగారెడ్డి జిల్లా జల్‌ పల్లి మున్సిపల్‌ పరిధి శ్రీరామకాలనీ లో ఉంటూ క్యాబ్ నడుపుకుంటూ జీవితం కొనసాగిస్తున్నాడు. నాగరాజుకు స్థానికంగా ఉండే వరలక్ష్మి(30)తో పరిచయం ఏర్ప‌డింది. ఆమె కాటేదాన్‌ పారిశ్రామికవాడలోని ఓ పెట్రోల్‌ బంకులో వ‌ర్క్ చేస్తోంది. అయితే , ఆ సమయానికే  ఆమెకు భర్త, కుమారుడు ఉన్నారు. నాగరాజు, వరలక్ష్మి మధ్య పరిచయం కాస్తా.. ప్రేమగా మారడంతో వరలక్ష్మి రెండేళ్ల క్రితం తన భర్తను వదిలేసి నాగరాజును వివాహాం చేసుకుంది. కొద్దిరోజుల పాటు  వీరి సంసారం బాగానే సాగినా, ఆ తర్వాత వరలక్ష్మి కొత్త వ్యక్తులతో సన్నిహితంగా మెలగడం నాగరాజు గమనించాడు. దీంతో వీరిమధ్య గొడవలు ప్రారంభం అయ్యాయి. మూడు రోజుల క్రితం ఈ విష‌యంపై పెద్ద‌ గొడవ జరిగింది. మంగళవారం తెల్లవారుజామున కూడా గొడవ జరిగింది. ఈ స‌మ‌యంలో నాగరాజు ఆగ్రహంతో భార్య గొంతు కోసి హతమార్చాడు. నేరుగా పహాడీషరీఫ్‌ ఠాణాకు వెళ్లి జరిగింది చెప్పి లొంగిపోయాడు. అయితే వరలక్ష్మికి నాగరాజు తొమ్మిదో భర్త అని విచార‌ణ‌లో తేలింది.  పెళ్లి చేసుకొని కొన్ని రోజులు గడిచిన తర్వాత  ఇతర వ్యక్తులతో సన్నిహితంగా ఉండడం, గొడవలు జరిగి భర్తలతో విడిపోయి మళ్లీ పెళ్లి చేసుకునేదని  పోలీసులు తెలిపారు.
Tags:    

Similar News