జగన్ తోనే తేల్చుకుంటారా ?

అదేంటో వైసీపీకి ఆ జిల్లా ఏ మాత్రం రాజకీయంగా అచ్చి రావడం లేదు. ఏ పార్టీకి ఇన్ని కష్టాలు ఉండవేమో.;

Update: 2025-12-29 08:30 GMT

అదేంటో వైసీపీకి ఆ జిల్లా ఏ మాత్రం రాజకీయంగా అచ్చి రావడం లేదు. ఏ పార్టీకి ఇన్ని కష్టాలు ఉండవేమో. తాము తయారు చేసిన నాయకులు, పదవులు ఇచ్చి పెద్దగా చేసిన వారే ఎదురు నిలిచి అసలైన ప్రత్యర్థులుగా మారడమే కాదు ఏకంగా పార్టీ ఊపిరిని ఉసురుని తీస్తున్నారు. దాంతో అంతంత మాత్రంగా ఉన్న పార్టీ మరింతగా పాతాళానికి కృంగిపోతోంది. అచ్చంగా చూస్తే శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ పరిస్థితి ఇలాగే ఉంది. పార్టీని చక్కదిద్దడానికి అధినాయకత్వం వ్యవహరిస్తున్న తీరు కూడా మొదటి నుంచి సరిగ్గా లేకపోవడం వల్లనే ఇపుడు ఈ దుస్థితి దాపురించింది అని అంటున్నారు.

మండిపోతున్న సోదరులు :

ఇదిలా ఉంటే శ్రీకాకుళం జిల్లాలో దశాబ్దాలుగా రాజకీయం చేస్తూ వస్తున్న ధర్మాన సోదరులకు ఇపుడు ఎన్నడూ లేని పరిస్థితి ఎదురవుతోంది. తమను పూర్తిగా టార్గెట్ చేసి దువ్వాడ శ్రీనివాస్ రచ్చ చేస్తూంటే ఏమీ చేయలేని పరిస్థితి ఉది రాజకీయ చాణక్యం అంటే ధర్మాన ఫ్యామిలీదే అని అంతా అంటారు. అలాంటి ఫ్యామిలీనే దువ్వాడ గట్టిగా ఢీ కొడుతున్నారు. ఎందాకైనా అన్నట్లుగా సవాల్ చేస్తున్నారు ఆయన రెండు రోజుల క్రింతం నిమ్మాడ జాతీయ రహదారి వద్ద కారు ఆపి మరి వదిలిన వీడియో బైట్ కానీ ధర్మాన ఫ్యామిలీని నేరుగా చాలెంజ్ చేసిన తీరు కానీ ఒక్కసారిగా వైసీపీని కదిలించేసింది.

పెద్దల దన్ను ఉందా :

సరిగ్గా ఇదే అనుమానంతో ధర్మాన సోదరులు ఉన్నారని అంటున్నారు. పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఏడాది పైగా అవుతోంది అయినా తాను వైసీపీకి చెందిన నేతనే అని దువ్వాడ చెప్పుకుంటున్నారు. అంతే కాదు ఏదో నాటికి తిరిగి వైసీపీ నుంచే పోటీ చేస్తారు అని ఆయన అనుచరులు అంటున్నారు అంటే ఆలోచించాల్సిందే అన్నది ధర్మాన అనుచరుల వైపు నుంచి వస్తున్న మాటగా ఉంది. పెద్దల దన్ను లేకపోతే దువ్వాడ ఈ విధంగా జోరు చేయగలుగుతారా అన్న డౌట్లు కూడా అదే పార్టీలో కొందరికి వస్తున్నాయట.

ఎందుకు లేట్ అన్నదే :

సత్తా ఉంటే తనను వైసీపీ నుంచి బహిష్కరించి చూడాలని దువ్వాడ గట్టిగా సవాల్ చేస్తున్నారు. మరి ఆ పని అధినాయకత్వం ఎందుకు చేయడం లేదు అన్నది ఒక చర్చ. అయితే దువ్వాడను పూర్తిగా బహిష్కరిస్తే ఆయన ఫ్రీ బర్డ్ అవుతారు, అపుడు ఆయన దూకుడు ఇంకా ఎక్కువ అవుతుందని నేరుగా అధినాయకత్వం మీదనే టార్గెట్ చేస్తారు అని కూడా అంటున్నారు మరో వైపు ఆయనను బహిష్కరిస్తే ఎమ్మెల్సీ సీటు ఖాళీ అయి టీడీపీ కూటమికి పోతుంది దాంతో అధినాయకత్వం ఈ విషయంలో ఆచీ తూచీ అన్నట్లుగా ఉంది. కానీ ఇలాగే దువ్వాడను వదిలేస్తే మాత్రం అది పార్టీకి అతి పెద్ద డ్యామేజ్ గానే ఉంటుంది అని పార్టీ వర్గాలు అంటున్నాయి.

జగన్ వద్దకే :

ఇక ఈ విషయంలో ఉపేక్షించేది లేదని ధర్మాన సోదరులు గట్టి పట్టుదలతో ఉన్నారు అని అంటున్నారు జగన్ వద్దకే వెళ్ళి ఏదో ఒకటి తేల్చుకోవాలని చూస్తున్నారు అని అంటున్నారు ఏమి జరిగితే అదే జరుగుతుంది అని దువ్వాడను పార్టీ నుంచి బహిష్కరించడమే బెటర్ అన్నది ధర్మాన అనుచరులలో వినిపిస్తున్న మాట అంటున్నారు. మరి ఈ విషయంలో కనుక అధినాయకత్వం ఇంకా ఇలాగే కొనసాగిస్తే మాత్రం ధర్మాన సోదరులు కూడా ఆగ్రహంతో ఏ నిర్ణయం తీసుకుంటారో అన్నది కూడా చర్చగా ఉంది. మొత్తానికి పార్టీ జిల్లాలో చీలిక దిశగా సాగుతోంది అన్నది మాత్రం హీటెక్కించే ప్రచారంగా ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News