ఏపీ - తెలంగాణలో అత్యధిక శాలరీ ఈమెకే..
భాగ్యనగరంలో ఐటీ కంపెనీలకు కొదవలేదు.. అత్యధిక జీతాల కోసం అమెరికా సహా విదేశాలకు వెళ్లాల్సిన పనే లేదు. ఎందుకంటే దిగ్గజ కంపెనీలన్నీ హైదరాబాద్ లోనే కొలువుదీరాయి. మంచి స్కిల్ ఉన్న వ్యక్తులకు కోట్లలో శాలరీలు ఇస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ కు చెందిన ఓ ఐటీ ఉద్యోగి శాలరీ .. ఆమె ఐటీ రిటర్న్స్ చూసి ఆదాయపన్ను శాఖ నోరెళ్లబెట్టింది. ఆమె ఏకంగా 9 కోట్లు ఆదాయపన్ను కడుతుండడం చూసి షాక్ తిన్నది. ఆమె జీతం ఎంతని ఆరాతీయగా కళ్లు బైర్లు కమ్మే వాస్తవం వెలుగుచూసింది.
రోజుకు 8 లక్షలు - గంటకు అక్షరాల లక్ష రూపాయలు.. నెలకు 2.5 కోట్లు - సంవత్సరానికి 9 కోట్లు.. ఇవేం లెక్కలు కాదు.. ఏడాదికి 30 కోట్లు జీతం తీసుకుంటున్న హైదరాబాద్ లోని ఓ బడా ఐటీకంపెనీలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగి జీతం కథ.. హైటెక్ సిటీలోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో ఈమె పనిచేస్తోంది. తెలంగాణ - ఏపీ రాష్ట్రంతో కలిపి వ్యక్తిగత ఆదాయం కింద అత్యధిక పన్ను కడుతున్న మహిళా ఉద్యోగిగా ఆమె గుర్తింపు పొందింది.
ఏడాదికి ఈ మహిళా ఉద్యోగి అందుకుంటున్న జీతం 30 కోట్లు.. అందులోంచి 30శాతం అంటే దాదాపు 9 కోట్ల రూపాయలను ఆమె ఆదాయపన్ను చెల్లిస్తోంది. వ్యక్తిగతంగా ఆదాయ పన్ను చెల్లించే వారిలో ఈమె మొదటిస్థానంలో ఉందని తాజాగా తెలంగాణ - ఏపీ ప్రాంతీయ ఆదాయపన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఎస్పీ చౌదరి వెల్లడించారు. గోప్యత కారణంగా ఆమె వివరాలు వెల్లడించలేం అని స్పష్టం చేశారు. గతేడాది కూడా ఆమె అత్యధిక పన్ను చెల్లింపుదారుగా నిలిచిందని తెలిపారు. గంటకు లక్షల్లో జీతం ఇచ్చే స్థాయిలో హైదరాబాద్ లో ఐటీ కంపెనీలున్నాయని తెలిసి అందరూ నోరెళ్లబెడుతున్నారు. హైదరాబాద్ కు అంతర్జాతీయ గుర్తింపు ఉందని సంబరపడుతున్నారు.