తల్లికి కామ పిచ్చి, కొడుకుకు ఆస్తి పిచ్చి..ప్రియుడితో కలసి అడ్డు తొలగింపు!

Update: 2020-10-04 08:50 GMT
సమాజంలో రోజు రోజుకూ మానవత్వం క్షీణిస్తోంది. ఇప్పటి వాళ్ళకు విలువలు పట్టడం లేదు. బరితెగింపు పోకడలు ఎక్కువయ్యాయి. కామం తలకెక్కి ఏం చేస్తున్నామో కూడా తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. ఓ మహిళ మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని అడ్డుగా ఉన్న భర్తను చంపేయాలని నిర్ణయించుకుంది. తండ్రిని చంపేస్తే ఆస్తి దక్కుతుందని కొడుకును రెచ్చగొట్టింది. కొడుకు, ప్రియుడు సాయంతో భర్తను కిరాతకంగా చంపేసింది. ఈ దారుణ సంఘటన  చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగింది. గుడుపల్లె మండలం గుండ్లసాగరానికి చెందిన జ్యోతి, శంకర్ భార్యాభర్తలు. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. శంకర్ మద్యానికి బానిసగా మారి ఇళ్ళు, భార్య గురించి పట్టించుకోవడం మానేయడంతో జ్యోతి అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం శంకర్ కు తెలియడంతో అతడు భార్యను వేధించడం మొదలు పెట్టాడు. మద్యం తాగి ఇంటికి వచినప్పుడల్లా ఈ విషయమై తగాదా జరుగుతుండటం మామూలైంది.

ఎలాగూ ఇంటి బాధ్యతలు పట్టించుకోకపోవడంతో భర్త  అడ్డు తొలగించుకుంటే తన అక్రమ సంబంధానికి అడ్డు ఉండదని జ్యోతి పథకం వేసింది. తండ్రిని అంతమొందించడానికి సహకరిస్తే ఆస్తి దక్కుతుందని కొడుకు అరుణ్ ని  కూడా రొంపిలోకి దింపింది.  గత నెల 23న మద్యం తాగి నిద్రపోతున్న శంకర్ ను ప్రియుడు, కొడుకుతో కలిసి జ్యోతి హత్య చేసింది. తర్వాత శవాన్ని ఎవరికీ అనుమానం రాకుండా మరో ప్రాంతంలోని ఓ చెరువులో పడేశారు. స్థానికులు శవాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు అయ్యింది. పోలీసుల విచారణలో వారికీ విస్తు గొలిపే నిజాలు వెల్లడయ్యాయి. ప్రియుడి కోసమే జ్యోతి మొగుడి అడ్డు తొలగించుకుందని ఆస్తి కోసం కొడుకు కూడా సహకరించాడని తేలింది.పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.  ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
Tags:    

Similar News