లడ్డూ ఇష్యూ కి లాజికల్ ఎండ్ ?

ఏపీలో గత కొంతకాలంగా మంటలు పుట్టించిన శ్రీవారి లడ్డూ ప్రసాదం వ్యవహారం ఇపుడు మెల్లగా సద్దుమణుగుతున్నట్లుగా కనిపిస్తోంది.;

Update: 2026-02-14 08:30 GMT

ఏపీలో గత కొంతకాలంగా మంటలు పుట్టించిన శ్రీవారి లడ్డూ ప్రసాదం వ్యవహారం ఇపుడు మెల్లగా సద్దుమణుగుతున్నట్లుగా కనిపిస్తోంది. హీటెక్కించే బిగ్ డిబేట్స్ తో పాటు ఫ్లెక్సీలు వాటిని చించడాలు అనుచిత వ్యాఖ్యలు ఆఖరుకు సీఎం మీద సైతం అమర్యాదకరమైన తీరులో విమర్శలు ఇవన్నీ వెరసి అరెస్టులు ఇళ్ళ మీద దాడులు పెట్రో బాంబులు ఇలా ఏపీలో చోటు చేసుకున్న విపరిణామాలతో ఒక్కసారిగా జాతీయ స్థాయిలోనూ బిగ్ డిబేట్ కి దారి తీసింది. ఆ మీదట ప్రభుత్వం వైపు నుంచి ఒక మీడియా మీట్ ఏర్పాటు చేసి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కీలక మంత్రులు అంతా మాట్లాడారు, శ్రీవారి లడ్డూ ఇష్యూలో కల్తీ చేసిన దోషులను ఎవరైనా వదలమని కచ్చితమైన సందేశం ఇచ్చారు. అంతే కాదు ఈ వ్యవహారంలో ఏక సభ్య కమిషన్ ని ఏర్పాటు చేస్తామని మొత్తం తెర వెనక ఉన్న సూత్రధారులను బయటకు తీసుకుని వస్తామని కూడా చెప్పారు. దాంతో మరిన్నాళ్ళు లడ్డూ ఇష్యూ హాట్ టాపిక్ గా మారుతుందని అంతా అనుకున్నారు.

అసెంబ్లీలో చంద్రబాబు :

ఇదిలా ఉంటే రాష్ట్ర అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ శ్రీవారి లడ్డూ వివాదం మీద కూడా కామెంట్స్ చేశారు. శాంతి భద్రతల విషయంలో ఎలాంటి రాజీ లేదని స్పష్టం చేశారు. రాజకీయ ముసుగులో కొందరు నేరాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తిరుపతి లడ్డూ వ్యవహారం చాలా సున్నితమైన అంశంగా బాబు చెప్పడం విశేషం కొందరు కావాలని దేవుడి పవిత్రతను భక్తుల మనోభావాలు దెబ్బతీయాలని ప్రయత్నించారని ఆయన అన్నారు. . ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు ఒక్కసారైనా శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించు కోవటం ఆనవాయితీగా బాబు గుర్తు చేశారు. ఇక ఈ లడ్డూలో జరిగిన కల్తీ గురించి జరిగిన తప్పులను చెప్పక పోతే అక్రమార్కులు తప్పు జరగలేదని బుకాయిస్తారని బాబు చెప్పడం విశేషం. టీటీడీ సహా అన్ని దేవాలయాల్లో పవిత్రతను కాపాడేందుకు కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.

జాగ్రత్తగానే అడుగులు :

ఇదిలా ఉంటే శ్రీవారి లడ్డూల కల్తీ జరిగింది అన్న దాని మీద ప్రభుత్వం చెప్పాల్సింది చెప్పింది. ప్రజలకు తమకు అందిన సమాచారం అంతా చెప్పామని ప్రభుత్వం అంటోంది. అయితే కల్తీ జరిగింది అని ఒప్పుకోకుండా విపక్షం ఎదురు దాడి చేస్తోంది అన్నది కూటమి పెద్దల విమర్శలుగా ఉన్నాయి. మరి ఈ విషయంలో ఎంత లాగితే అంతలా అటూ ఇటూ డిబేట్స్ తప్ప ఒరిగేది లేదన్నది కూడా ఉంది. తాజాగా అంబటి రాంబాబును రాజమండ్రి జైలులో పరామర్శిస్తూ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలు చూస్తే కూటమి పెద్దలు తిరుమల లడ్డూ విషయంలో లాజికల్ ఎండ్ కి తేవాలని అన్నారు అలా కాకుండా ఆ వైపు నుంచి ఎంత మాట్లాడితే తాము అంతకు అంతా మాట్లాడుతామన్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు.

చట్టపరంగానే చేయాల్సింది :

దాంతో ప్రభుత్వం ఈ విషయంలో జాగ్రత్తగానే అడుగులు వేస్తోంది అని అంటున్నారు. దాంతోనే అసెంబ్లీలో సీఎం ఈ అంశం సున్నితమైనది అని చెబుతూ వచ్చారు. మరో వైపు చూస్తే నంద్యాల సభలో సీఎం లడ్డూ ప్రసాదంలో మరిన్ని కలుషితాలు కలిసాయని కూడా విమర్శించారు. ఆ తరువాత ఆయన ఏమీ మాట్లాడలేదు, ఈ మధ్యలో ఢిల్లీకి వెళ్ళి వచ్చారు. కేంద్ర పెద్దలకు కూడా లడ్డూ ప్రసాదం కల్తీ జరిగింది అన్న ఇష్యూ వివరించి ఉంటారని అంటున్నారు. మొత్తానికి చూస్తే కూటమి ఈ ఇష్యూ మీద ఇక మీదట పెద్దగా డిబేట్లకు పోకుండా చట్టపరంగానే చేయాల్సింది చేయాలన్న ఆలోచనలో ఉంది అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఏపీలో లడ్డూ ఇష్యూకి లాజికల్ ఎండ్ పడిందా అన్నదే అంతా ఆలోచిస్తున్న విషయం.

Tags:    

Similar News