నిద్ర పోయిన ఉబర్ డ్రైవర్.. ఆమె ఏం చేసిందంటే?
ఉబర్ డ్రైవర్ ఒకరు తన నిద్రతో ప్రయాణికురాలికి షాకిచ్చిన వైనం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. తనకు ఎదురైన వింత అనుభవాన్ని సోషల్ మీడియాలో వెల్లడించిన సదరు మహిళ.. ఉబర్ కు తనకు ఎదురైన పరిస్థితి గురించి కంప్లైంట్ చేసింది. ఇంతకీ ఉబర్ డ్రైవర్ నిద్ర మహిళా ప్యాసింజర్ కు తెచ్చిన కష్టమేమిటో చూస్తే..
ఫూణె నుంచి ముంబయికి బయలు దేరారు తేజస్విని దివ్యా నాయక్. తన ప్రయాణం కోసం ఉబర్ ను ఆశ్రయించారు. ఆన్ లైన్లో ఉబర్ క్యాబ్ బుక్ చేసుకున్న ఆమె.. తన ప్రయాణం మొదలైనంతనే ఆమె షాక్ కు గురైంది. ఎందుకంటే కారు డ్రైవర్ తీవ్రంగా అలిసి పోవటమే కాదు.. నిద్ర మత్తులోనే డ్రైవ్ చేస్తున్నట్లు గుర్తించారు. ఒక దశలో ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టబోయాడు. పరిస్థితిని గుర్తించిన ఆమె.. కారును రోడ్డు పక్కగా ఆపించింది.
తనకు డ్రైవింగ్ వచ్చని.. తాను డ్రైవ్ చేస్తానంటూ డ్రైవర్ ను ఒప్పించి..స్టీరింగ్ చేతబట్టింది. తన పక్కనే డ్రైవర్ ను కూర్చోబెట్టుకొని గమ్యస్థానానికి చేరుకుంది. ఈ సందర్భంగా సదరు డ్రైవర్ గాఢ నిద్రలోకి జారుకోవటాన్ని ఆమె వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఉబర్ క్యాబ్ లో తనకు ఎదురైన అనుభవం గురించి ఆమె వాపోవటమే కాదు.. తాను చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించేందుకు నిరాకరించారు. ఉబర్ డ్రైవర్లు రోజులో 12 నుంచి 14 గంటల పాటు పని చేయాల్సి రావటంతో తీవ్రంగా ఆలిసి పోతున్న వైనాన్ని ఆమె పేర్కొన్నారు. తనకు ఎదురైన వింత అనుభవంతో పాటు.. దానికి సాక్ష్యంగా చిట్టి వీడియోను పోస్టు చేసింది. మరి.. ఉబర్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఆమె పోస్టు చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

thanking god I’m alive right now and I wasn’t asleep when this happened & that I know how to drive.@Uber @Uber_Support @Uber_India I am seething with anger right now. how dare they drive if they’re not well rested? how dare they put anyone else’s life at risk?
— tejaswinniethepooh (@teja_main_hoon_) February 21, 2020
part 1 #uber pic.twitter.com/lUUFXpHCQS