ఫ్రెండ్లీ ఫైరింగ్ అంటే ఏమిటి .. ఎందుకు జ‌రుగుతుంది ?

కువైట్ మూడు ఎఫ్-15 ఈ స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానాల‌ను కూల్చింది. పైలెట్లు ఆరుగురు సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు.;

Update: 2026-03-04 15:42 GMT

ఫ్రెండ్లీ ఫైరింగ్. విన‌డానికి బావుంది. కానీ జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయి ఉంటుంది. న‌ష్టం చేసింది శ‌త్రువు కాదు మిత్రుడే అని తేలిన త‌ర్వాత ఆ ఘ‌ట‌న‌ను ఫ్రెండ్లీ ఫైరింగ్ గా పిలుస్తారు. అమెరికా-ఇరాన్ యుద్ధ స‌మ‌యంలో.. అమెరికాకు మిత్రదేశ‌మైన కువైట్.. ఇరాన్ విమానాలు అనుకుని.. పొర‌బ‌డి, అమెరికా విమానాల‌ను కూల్చింది. తీరా కూల్చాక తెలిసింది. ఇరాన్ విమానాలు కాదు. అమెరికావ‌ని. అప్పుడు ఈ ఘ‌ట‌న‌ను ఫ్రెండ్లీ ఫైరింగ్ గా ప్ర‌క‌టించారు. ఫ్రెండ్లీ ఫైరింగ్ ఎందుకు చేస్తారు ?. కార‌ణాలు ఏంటి ?. మితృదేశాల యుద్ధ విమానాల‌ని ముందే తెలియ‌దా ? అన్న ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి.

ఫ్రెండ్లీ ఫైరింగ్ :

కువైట్ మూడు ఎఫ్-15 ఈ స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానాల‌ను కూల్చింది. పైలెట్లు ఆరుగురు సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. కానీ కువైట్ మితృదేశ‌మైన అమెరికా యుద్ధ విమానాలు పొర‌బ‌డి ఎందుకు కూల్చింద‌న్న ప్ర‌శ్న‌కు అనేక కార‌ణాలు ఉన్నాయి. మొద‌ట‌గా మితృదేశ ద‌ళాల‌ను, యుద్ధ విమానాల‌ను శ‌త్రు దేశ సైన్యం, యుద్ధ విమానాల‌ని పొర‌బ‌డి, త‌ప్పుగా గుర్తించి దాడి చేయ‌డం వ‌ల్ల ఫైరింగ్ జ‌రుగుతుంది. తెలిసాక దీనిని ఫ్రెండ్లీ ఫైరింగ్ అంటారు. మొద‌టి కార‌ణం త‌ప్పుగా గుర్తించ‌డం. శ‌త్రువో, మిత్రుడో స‌రిగా అంచ‌నా వేయ‌లేక‌పోవ‌డం.

రెండో కార‌ణం గ్రౌండ్ ఫోర్సెస్, ఎయిర్ ఫోర్సెస్ మ‌ధ్య స‌మ‌న్వ‌యం లేక‌పోవ‌డం. దీని కార‌ణంగా సొంత దేశ విమానాల‌ను కూడా కూల్చిన ఘ‌ట‌న‌లు ఉన్నాయి. మూడో కార‌ణం టెక్నిక‌ల్ స‌మ‌స్య‌లు. రాడార్ లేదా జీపీఎస్ లోపాల వ‌ల్ల రాంగ్ టార్గెట్ లాక్ అవ‌డం వ‌ల్ల జ‌రుగుతాయి. నాలుగో కార‌ణం యుద్ధ గంద‌ర‌గోళం. యుద్ధ‌మంటేనే గంద‌ర‌గోళం. ఇలాంటి స‌మ‌యంలో త‌ప్పులు జ‌రుగుతాయి. విచార‌ణ త‌ర్వాత దాడి చేసింది శ‌త్రువా ?. మిత్రుడా ? అన్న‌ది తేలాక నిర్ణ‌యం ప్ర‌క‌టిస్తారు. మిత్రుడైతే కార‌ణాలు తెలుసుకుని స‌హేతుక‌మైతే ఫ్రెండ్లీ ఫైరింగ్ గా ప్ర‌క‌టిస్తారు. ఒక్కోసారి ఈ ఘ‌ట‌న‌లు దేశాల మ‌ధ్య అపార్థాల‌కు దారితీస్తాయి. ఒక్కోసారి సొంత సైనికుల‌ను పోగొట్టుకోవాల్సి వ‌స్తుంది.

ఫ్రెండ్లీ ఫైరింగ్ కు చెక్ పెట్టాలంటే ?

టెక్నాల‌జీ, ట్రైనింగ్ , క‌ఠిన ప్రోటోకాల్ తో గ‌ణ‌నీయంగా త‌గ్గించ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. ఐఎఫ్ఎఫ్ టెక్నాల‌జీని ఎయిర్ క్రాఫ్టులు, డ్రోన్లు, ట్యాంక‌ర్ల‌లో ఏర్పాటు చేయాలి. గ్రౌండ్ ఫోర్స్, ఎయిర్ ఫోర్స్, నేవీ మ‌ధ్య రియ‌ల్ టైమ్ క‌మ్యూనికేష‌న్ నెట్ వ‌ర్క్ ఉండాలి. టార్గెట్ పై కాల్పులు జ‌రిపే ముందు టూ లెవ‌ల్ క‌న్ఫ‌ర్మేష‌న్ ఉండాలి. మితృదేశాల మ‌ధ్య ఒకే ఫ్రీక్వెన్సీ, కోడ్ ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి. ఫాగ్ ఆఫ్ వార్ ప‌రిస్థితుల్లో సిమ్యులేష‌న్ ట్రైనింగ్ ఇవ్వాలి. ఇలా చాలా అంశాల్లో మితృదేశాలు క‌లిసి ప‌నిచేయాల్సి ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గ‌ల్ఫ్ లాంటి హైటెన్ష‌న్ జోన్ల‌లో ఇలాంటి ప్ర‌మాదాలు ఎక్కువ‌గా జ‌రిగే అవ‌కాశాలు ఉంటాయని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

Tags:    

Similar News