భారత్ లో వీపీఎన్ బ్యాన్ కాబోతుందట ?
పార్లమెంట్ కు చెందిన హోం వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వీపీఎన్ ను నిషేధించాలని సిఫార్సు చేసింది. దీనితో వీపీఎన్ దేశంలో బ్యాన్ అవుతుందా, అనే ఊహాగానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. సైబర్ బెదిరింపులు, ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టడానికి అడ్డుగా ఉన్న వర్చువల్ ప్రైవేట్ నెట్ వర్క్ సేవలను నిషేదించాలని భావిస్తున్నారు.
వీపీఎన్ అంటే..ఆన్ లైన్ లో మనల్ని ఎవరూ ట్రాక్ చేయకుండా మనకు కావాల్సిన వెబ్ సైట్లు, స్ట్రీమింగ్ వెబ్ సైట్ల ను చూసే వీలుంటుంది. ఫ్రీగా వీపీఎన్ అందించే సంస్థల్లో ఏవీ బెస్ట్ ఫీచర్లను అందించలేవు. అయితే పబ్లిక్ వైఫై లాంటివి ఉపయోగించినప్పుడు వీటిని ఉపయోగించడం వల్ల మీ వివరాలు ఇతరులకు తెలియకుండా కాపాడుకునే వీలుంటుంది. ఫ్రీ వీపీఎన్ అందించే సంస్థలు కొన్ని సర్వీసులను ప్రీమియంగా నిర్వచించి వాటికి డబ్బు కట్టేలా చేస్తాయి. మరికొన్ని మీ బ్రౌజర్లలో వచ్చే యాడ్స్ ద్వారా ఇంకొన్ని సంస్థలు మీ వివరాలను అమ్మడం ద్వారా డబ్బు సంపాదిస్తాయి. అందుకే వీలైనంత వరకూ మరీ అవసరం అయితే తప్ప ఫ్రీ వీపీఎన్ కి దూరంగా ఉండాలి.
ఫ్రీ వీపీఎన్ సర్వీసులు మీ డేటాను ఎన్ క్రిప్ట్ చేస్తాయి. మీరు చేరుకోవాల్సిన గమ్యస్థానాన్ని సులువుగా చేరేలా చేస్తాయి. కేవలం సెక్యూర్ వెబ్ సెషన్ ని, డేటా ఎన్ క్రిప్షన్ ని అందించడమే కాదు. సెండర్, రెసిపియంట్ వివరాలను కూడా రహస్యంగా ఉంచుతాయి. ఇవన్నీ ఇంటర్నెట్ ప్రొటోకాల్ సెక్యూరిటీని ఉపయోగించుకుంటాయి. అయితే వీపీఎన్ మీ డేటాను సెక్యూర్ చేయడంలో భాగంగా మీ డేటా స్పీడ్ ఒక్కోసారి చాలా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఫ్రీ వీపీఎన్ ని ఉపయోగించేటప్పుడు ఇది ఇంకా ఎక్కువ. బెస్ట్ ఫ్రీ వీపీఎన్ అయితే పెద్ద పెద్ద డేటా పైప్స్‌ని కలిగి ఉండి ఈ వేగాన్ని తగ్గకుండా కాపాడతాయి.
సైబర్ బెదిరింపులు, ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టడానికి అడ్డుగా ఉన్న వర్చువల్ ప్రైవేట్ నెట్ వర్క్ సేవల ను మన దేశంలో హోం వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నిషేధించాలని చూస్తున్నట్లు సమాచారం. మీడియానామా మొదట నివేదించినట్లుగా వీపీఎన్ యాప్స్, సాధనాలు ఆన్ లైన్ లో సులభంగా అందుబాటులో ఉన్నాయని, దీంతో నేరస్థులు ఆన్ లైన్ లో అనామకంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే దాని వాడకాన్ని నిషేదించాలని కోరుతున్నట్లు కమిటీ సిఫార్సు చేసింది.
వీపీఎన్ లను గుర్తించడానికి, శాశ్వతంగా నిరోధించడానికి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకోవాలని కమిటీ హోం మంత్రిత్వ శాఖను కోరింది.