పార్టీలకు సుప్రీంకోర్టు మరో షాకిస్తుందా ?
రాజకీయ పార్టీలకు తొందరలోనే సుప్రీంకోర్టు మరో పెద్ద షాక్ ఇవ్వబోతోందా ? ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తీవ్రమైన నేరాభియోగాలు ఎదుర్కొంటున్నవారిని ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా దూరంగా ఉంచాలనే డిమాండ్ పెరిగిపోతోంది. ఇదే డిమాండ్ తో 2020లోనే అశ్వినీ ఉపాధ్యాయ అనే లాయర్, బీజేపీ నేత సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. అయితే అప్పటినుండి ఇప్పటివరకు పిటిషన్ పై సరిగా విచారణ జరగలేదు.
ఇదే విషయాన్ని సదరు లాయర్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దృష్టికి శనివారం తెచ్చారు. సుదీర్ఘంగా విచారణ జరిగి తీర్పు రావటానికి చాలా టైం పడుతుంది కాబట్టి తక్షణమే అభియోగాలను ఎదుర్కొంటున్న నేతలను పోటీకి దూరంగా ఉంచాలంటు ఉపాధ్యాయ మళ్ళీ కోర్టును కోరారు. తీవ్రమైన అభియోగాలు ఎదుర్కొంటున్నవారే ఇపుడు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలలో కొన్ని వందలమందుంటారు. ఈ పార్టీ అని ఇంకో పార్టీ అని అభియోగాళ్ళను ఎదుర్కునే వాళ్ళకు తేడానేలేదు.
వివిధ కారణాలతో తమ మీదున్న కేసులను వెంటనే విచారణ జరగకుండా ఏదోలా చాలామంది మ్యానేజ్ చేస్తుంటారు. కాబట్టి చాలామంది మీద నమోదవుతున్న అభియోగాలపై ఒకపట్టాన కేసులు తెమిలే అవకాశాలు లేవు. ఇదే విషయాన్ని ఉపాధ్యాయ కోర్టు దృష్టికి తెచ్చారు. ఇప్పటికే అభియోగాలు ఎదుర్కొంటున్న నేతలను పోటీకి దూరంగా ఉంచాలని చీఫ్ జస్టిస్ ను రిక్వెస్ట్ చేశారు. ఈ విషయంలోని సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని చీఫ్ జస్టిస్ హామీ ఇచ్చారు.
అయితే ఇప్పటికిప్పుడు ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల్లోనే అమలు చేయటానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తామన్నారు. ఇపుడున్న అవకాశాలు ఎంత ఉందనే విషయాన్ని కేంద్ర ఎన్నికల కమీషన్ తో కూడా ప్రస్తావిస్తామన్నారు. కాకపోతే ఇప్పటికిప్పుడు ఉపాధ్యాయ డిమాండ్ అమల్లోకి వచ్చే అవకాశాలు దాదాపు లేదనే చెప్పాలి. ఎందుకంటే అభియోగాలు నిరూపణ కానంతవరకు ఎవరినీ కోర్టు నేరస్తుడిగా చెప్పేందుకు లేదు. కాబట్టి చీఫ్ జస్టిస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.