ఏపీలో సర్వే కోసం జగన్ సర్కారు అన్ని వేల కోట్లు ఖర్చు చేస్తుందా?
మరికొద్ది వారాల్లో ఏపీ వ్యాప్తంగా ఉన్న భూముల్ని సమగ్రంగా సర్వే చేసేందుకు భారీ ఎత్తున ప్లాన్ చేస్తోంది జగన్ సర్కారు. భూమికి నాలుగు వైపులా హద్దుల్ని డిసైడ్ చేస్తూ.. నాలుగు రాళ్లను ఏర్పాటు చేయటం.. వాటిపై వివరాల్ని.. సీఎం జగన్ బొమ్మను చెక్కించాలన్న ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ.. అదే జరిగితే హద్దు రాళ్లను ఏర్పాటు చేయటం కోసం దాదాపు ఆరు కోట్ల రాళ్లు అవసరమవుతాయని.. అందుకోసం ఏకంగా రూ.27వేల కోట్ల ఖర్చుకు జగన్ సర్కారు సిద్ధమవుతుందన్న వార్తలు వస్తున్నాయి.
నిజంగానే అలాంటి పని ప్రభుత్వం చేస్తుందా? చేస్తే.. అంత భారం మోసే శక్తి ప్రభుత్వానికి ఉందా? అన్నది ప్రశ్నలుగా మారాయి. జనవరి ఒక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూముల సమగ్ర సర్వే నిర్వహించాలని జగన్ సర్కారు భావిస్తోంది. దీనికి సంబంధించి రెవెన్యూ అధికారులకు ప్లానింగ్ సిద్ధం చేస్తున్నారు. ప్రతి భూ యజమానికి.. అతనికి ఉన్న భూమికి నాలుగు హద్దుల్లో రాళ్లను ఏర్పాటు చేయటం.. ఆ సర్వే రాళ్లపై సీఎం జగన్ ఫోటోను ముద్రించాలని.. అందుకోసం గ్రానైట్ రాళ్లను వినియోగించాలన్న ఆలోచనలో ఉన్నటల్ుగా చెబుతున్నారు.
ఇందుకోసం ఒక్కో రాయికి రూ.4500 చొప్పున ఖర్చుచేయాల్సి ఉంటుందంటున్నారు. ఈ లెక్కలే నిజమైతే.. మొత్తం ఆరు కోట్ల రాళ్ల కోసం రూ.27వేల కోట్లు అవసరమవుతాయి. అయితే.. ఇంత భారీ మొత్తాన్ని ఖర్చు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదంటున్నారు. ప్రాథమికంగా జరుగుతున్న చర్చను పక్కదారి పట్టిస్తూ.. ప్రభుత్వాన్ని దెబ్బ తీయటానికి లేనిపోని ప్రచారం షురూ చేశారని చెబుతున్నారు. అయితే.. ఈ వాదనను తప్పు పడుతున్నారు. తాజాగా సీఎం జగన్ కు ఇచ్చిన సమగ్ర సర్వేలో హద్దు రాళ్లుగా ఏర్పాటు చేసే ఒక్కో రాయి రూ.4500 ఉంటుందని చెప్పినట్లుగా చెబుతున్నారు.
అయితే.. ఈ వాదన అంతా తప్పుగా తేల్చేస్తున్నారు. చూస్తూ.. చూస్తూ.. హద్దు రాళ్ల కోసంరూ.27వేల కోట్లు ఖర్చు చేయటానికి ఏ సీఎం సాహసించరని.. తప్పుడు ప్రచారంతో ప్రభుత్వ ఇమేజ్ ను దెబ్బ తీయాలన్న ఆలోచనతో ఇదంతా చేస్తున్నట్లుచెబుతున్నారు. ఇంత భారీ మొత్తంతో సాగునీటి ప్రాజెక్టు కోసం ఖర్చు చేస్తే ఫలితం ఉంటుందని.. తెలివైన ఏ ముఖ్యమంత్రి ఈ తరహా నిర్ణయం తీసుకోరంటున్నారు. జగన్ లాంటి ప్రాక్టికల్ సీఎం ఇలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.