నాసిర‌కం మ‌ద్యం జ‌గ‌న్ కొంప ముంచుతుందా?

Update: 2021-11-01 03:30 GMT
నాసిర‌కం మ‌ద్యం ఏపీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ కొంప‌ముంచుతుందా?  మ‌ద్య నిషేధం అమ‌లు చేస్తా మ‌ని చెప్పి.. ఇప్పుడు 15 ఏళ్ల‌పాటు మ‌ద్యంపై వ‌చ్చే ఆదాయాన్ని చూపించి.. అప్పులు తెచ్చుకున్నార‌నే ప్రచారం నిజ‌మేనా? ఇప్పుడు.. ఈ చ‌ర్చ జోరుగా సాగుతోంది. నిజానికి ఇప్పుడు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం ఏపీ. ఎందుకంటే.. న‌వ‌ర‌త్నాలు వంటి ప‌థ‌కాల‌ను భుజాన వేసుకున్న వైసీపీ అధినేత‌.. వీటిని అమ‌లు చేసేందుకు నానా ప్ర‌యాస ప‌డుతున్నారు.

మ‌రోవైపు రాష్ట్రానికి ఆదాయ వ‌న‌రులు పూర్తిగా పోయాయి. రాజ‌ధాని అమ‌రావ‌తిని ప‌క్క‌న పెట్ట‌డంతో కీల‌క‌మైన రిజ‌స్ట్రేష‌న్లు.. రియ‌ల్ ఎస్టేట్‌.. వంటివి ప‌క్క దారిప‌ట్టాయి. ఫ‌లితంగా ఏపీ ప్ర‌భుత్వానికి ఇప్పుడున్న ఏకైక ఆదాయం.. మ‌ద్యం. మ‌ద్య నిషేధం చేస్తామ‌ని చెప్పిన‌.. ధ‌రలు పేలిపోయేలా చేసి.. భారీ ఎత్తున ఆదాయం తీసుకుంటున్నార‌నే వాద‌న ఉంది. అంతేకాదు. రాబో యే 15 ఏళ్ల‌కు సంబందించిన ఆదాయాన్ని కూడా.. తాక‌ట్టు పెట్టి అప్పులు తీసుకుంటున్నార‌ట‌. మ‌రో వైపు... ధ‌ర‌లు పెంచేశారు.

రూ.60 ఉండాల్సిన క్వార్ట‌ర్ బాటిల్ 200 చేశారు. ఇది కూడా నాసిర‌కం మ‌ద్యం. అంతేకాదు.. ఇవ‌న్నీ.. పేర్లు కూడా తెలియ‌ని బ్రాండ్లు. చెత్త బ్రాండ్లు అని మ‌ద్యం ప్రియులు చెప్పుకొంటు న్నారు. ఇలాంటి ఊరు పేరు లేని మందు తీసుకువ‌చ్చి.. మా కొంప ముంచుతారా? అని వారు ప్ర‌శ్నిస్తున్నారు. అయితే.. ఈ విష‌యంలో న్యాయ‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లు రాకుండా.. బ్రాండెడ్ స‌రుకును కొంత తెచ్చి.. నాసిర‌కం మ‌ద్యాన్ని.. భారీ ఎత్తున విక్ర‌యిస్తున్నార‌ని.. పెద్ద ఎత్తున మ‌ద్యం ప్రియులు చెబుతున్నారు. అంతేకాదు.. ఛీ.. ఛీ.. చీప్‌!! అంటూ.. తాగే వాళ్లు కూడా తీవ్ర‌స్థాయ‌లో జ‌గ‌న్‌పై విరుచుకుప‌డుతున్నార‌ట‌.

రేట్లు భారీగా పెంచేసి.. ఇంత చెత్త మందు అమ్ముతున్నార‌నే ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న న‌వ‌ర‌త్నాల డ‌బ్బులు.. అందుతున్న వారిలో దాదాపు 25 శాతం మంది మందుకే ఖ‌ర్చు పెడుతున్నారని మేధావులు అంటున్నారు. అలాగ‌ని.. మంచి మందు.. ఇవ్వ‌కుండా.. ప్ర‌భుత్వం లో ఉన్న కొంత మంది పెద్ద‌లు.. బినామీలుగా మారి.. నాసిర‌కం మందు.. అమ్ముతూ.. జ‌నాల‌ను ఇబ్బంది పాలు చేస్తున్నార‌నే వాద‌న ఉంది.  

అయితే.. ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే.. రాష్ట్రంలో తీవ్ర వ్య‌తిరేక‌త‌.. ముఖ్యంగా ఏ వ‌ర్గాల‌నైతే.. జ‌గ‌న్ న‌మ్ముకురో.. అదే వ‌ర్గాలు.. ఇప్పుడు తిర‌గ‌బ‌డే ప్రమాదం ఉంద‌ని అంటున్నారు. పేద‌లు ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్‌కు అనుకూలంగా ఉన్నారు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు.. మ‌ద్యంవిష‌యంలో జ‌గ‌న్ అనుస‌రిస్తున్న విధానం వీరికి తీవ్ర ఆగ్ర‌హం తెప్పిస్తోంది. ఈ క్ర‌మంలో.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇదే విష‌యం యాంటీగా మారితే.. జ‌గ‌న్‌కు ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఇప్ప‌టికైనా.. మ‌ద్యం విధానం మారుస్తారో.. చూడాలి.
Tags:    

Similar News