ప్రియాంక కూడా విరక్తి వ్యక్తం చేసినట్టే?

Update: 2019-07-26 07:18 GMT
కాంగ్రెస్ పార్టీ కి జాతీయాధ్యక్షుడు లేకుండా పోయి నెలలు గడుస్తున్నాయి. లోక్ సభ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే రాహుల్ గాంధీ అస్త్రసన్యాసం చేశారు. తను కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడిగా ఉండాలనుకోవడం లేదని ఆయన తేల్చి చెప్పారు.

కొన్నాళ్ల పాటు ఆయనను కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ మిత్రపక్షాల నేతలు బతిమాలారు. జాతీయాధ్యక్ష పదవిని వదలొద్దని  కోరారు. అయితే ఆయన మాత్రం ఎవ్వరి  మాటనూ వినలేదు. తను చేసిన రాజీనామాకు కట్టుబడ్డారు. దీంతో ఏఐసీసీకి కొత్త అధ్యక్షుడి ఎన్నిక తప్పడం లేదు.

ఈ నేపథ్యంలో మళ్లీ సోనియానే తాత్కాలికంగా బాధ్యతలు తీసుకున్నారు. ఇక ఎవరు? అంటే ప్రియాంకగాంధీ పేరు ప్రముఖంగా వినిపించింది, వినిపిస్తోంది. ఏఐసీసీ జాతీయాధ్యక్ష పదవి కచ్చితంగా గాంధీల కుటుంబం చేతిలోనే ఉండాలని కాంగ్రెస్ నేతలు వాదిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రియాంకకే ఆ పదవిని అప్పగించాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.

అయితే ప్రియాంక కూడా ఆ పదవిని తీసుకునేందుకు అంత సానుకూలంగా లేదని సమాచారం. తనకు ఏఐసీసీ అధ్యక్ష పదవి వద్దని అంటోందట ప్రియాంక. ఈ విషయంలో అచ్చం రాహుల్ తీరునే స్పందిస్తోందట ప్రియాంక. మరి ప్రియాంక కూడా వద్దని అంటే ఏఐసీసీ పగ్గాలు ఎవరు చేపడతారు? అనేది చర్చనీయాంశంగా మారుతూ ఉంది. కాంగ్రెస్ నేతలు మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ ఏఐసీసీ ప్రెసిడెంట్ గా గాంధీ కుటుంబీకులే ఉండాలని వాదిస్తూ ఉండటం గమనార్హం.

    

Tags:    

Similar News