తెలంగాణ సత్తాకు భాహుబలే నిదర్శనం!

Update: 2019-11-21 08:43 GMT
సినిమా .. ప్రస్తుత ప్రపంచంలో అగ్ర స్థానంలో కొనసాగుతుంది. ఒకప్పటి సినిమాకి  - ఇప్పటి సినిమాకి ఎన్నో మార్పులు ఉన్నాయి. నిర్మాణ విలువలు కూడా భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా తెలుగు సినిమాల విషయానికొస్తే .. తెలుగు సినిమాలు కూడా ప్రపంచ స్థాయిలో పోటీ పడిన చిత్రాలు కూడా ఉన్నాయి. దానికి ప్రధాన కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌. మనం ఎన్నో రకాలైన సినిమా చూస్తూనే ఉంటాం. కొన్ని సన్నివేశాలు అంతలా పండటానికి డైరెక్టర్లు - క్రియేటర్స్ ఆలోచనలు ఎంత ప్రధానమో టెక్నాలజీ వినియోగం అంతకంటే ముఖ్యం. మనిషి ఆలోచనకు జీవం పోస్తూ  అన్ని  ఎమోషన్స్‌కు గురయ్యేలా విజువల్ ఎఫెక్ట్స్ పాత్ర అద్భుతం. అది యానిమేషన్ రంగమైనా.. గేమింగ్ రంగంమైనా. 

ప్రస్తుతం మనం చూస్తున్న సినిమా - సీరియల్ ఏదైనా విజువల్ ఎఫెక్ట్స్ ఉండాల్సిందే. అయితే వీఎఫెక్ట్స్ గురించి క్షుణ్ణంగా తెలుసుకునే అవకాశం లభించడం అరుదు. కానీ భారత్‌ లోనే మొదటి ప్రత్యేక వీఎఫ్‌ ఎక్స్ సమ్మిట్ హైదరాబాద్ వేదికగా జరుగడం విశేషం. దేశ - విదేశాల నుంచి ప్రముఖులు హాజరై  మాట్లాడతారు. ఇది నాలుగు రోజుల పాటు జరగనుంది. ఎంటర్‌ టైన్‌ మెంట్‌ రంగాలకు చెందిన జాతీయ - అంతర్జాతీయ కంపెనీలు పాల్గొన్న ఇండియా జాయ్‌ అంతర్జాతీయ సదస్సు - ప్రదర్శన బుధవారం హెచ్‌ ఐసీసీలో ప్రారంభమైంది.

ఈ సదస్సు కి హాజరైన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ..విజువల్‌ ఎఫెక్ట్స్‌ ద్వారా ఘన విజయాలు సాధించిన బాహుబలి - లైఫ్‌ ఆఫ్‌ పై - అరుంధతి - మగధీర - ఈగ చిత్రాల నిర్మాణం హైదరాబాద్‌ లో జరగడం - 10 కోట్ల మంది ఫాలోవర్స్‌ ఉన్న ఛోటా భీమ్‌ హైదరాబాద్‌ కంపెనీ కావడం ఈ రంగంలో తెలంగాణ సత్తాకు నిదర్శనం అని తెలిపారు. హైదరాబాద్‌ తెలుగు సినిమాకే కాకుండా దక్షిణాసియాకే ప్రధాన కేంద్రం కావాలన్నది ముఖ్యమంత్రి ఆశయమన్నారు. భారీ ప్రాజెక్టులు నెలకొల్పాలంటే పెద్దమొత్తంలో భూమి అవసరం అవుతుందని, కానీ యానిమేషన్‌ - విజువల్‌ ఎఫెక్ట్స్‌ - గేమింగ్‌ - కామిక్స్‌  రంగంలో ఐదెకరాల్లో అద్భుతమైన స్టూడియోలు ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. గేమింగ్‌ రంగం ఇటీవలే కాలంలో వేగంగా వృద్ధి సాధిస్తోందని - గేమింగ్‌ స్టార్టప్స్‌ 2010లో హైదరాబాద్‌ లో 25 ఉంటే ప్రస్తుతం 250 ఉన్నాయని తెలిపారు. 




Tags:    

Similar News