పవన్ కళ్యాణ్ ఓటేసిన దగ్గర జనసేన గెలుస్తుందా?
ఇపుడిదే అంశంపై విజయవాడలో చర్చ జరుగుతోంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేఫన్ ఎన్నికల్లో 9వ డివజిన్ పరిధిలోని పడమటిలంక ప్రాంతంలో ఉన్న కొమ్మ సీతారామయ్య జడ్పీ హై స్కూల్ పోలింగ్ బూత్ లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓటేశారు. పవన్ ఓటేయగానే అందరి దృష్టి పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్ధి ఎవరనే విషయమై చర్చ మొదలైంది. కానీ విచిత్రం ఏమిటంటే జనసేన తరపున పోటీ చేస్తున్న అభ్యర్ధెవరో కూడా చాలామందికి తెలీదు.
అసలు 9వ డివిజన్ లో జనసేన అభ్యర్ధి పోటీ చేస్తున్నారా ? లేదా ? అన్న విషయంలో కూడా క్లారిటిలేదు. ఎందుకంటే పవన్ ఎక్కడ ఓటేశారు ? ఏ డివిజన్, ఏ పోలింగ్ సెంటర్లో పవన్ ఓటేశారనే వివరాలతో ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన పార్టీ కూడా 9వ డివిజన్లో పార్టీ తరపున ఎవరైనా పోటీ చేస్తున్నారా లేదా కూడా చెప్పలేదు. అంటే తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్ధుల విషయంలో పార్టీ నేతలకే క్లారిటి లేనపుడు ఇక మామూలు జనాలు ఎందుకు పట్టించుకుంటారు ?
ఒకవేళ జనసేన అభ్యర్ధి పోటీలో ఉంటే అధినేత పవన్ ఓటుతో సదరు అభ్యర్ధి గెలుస్తారా అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్ధుల జాబితాను పార్టీ అధికారికంగా ప్రకటించలేదు. ఇదే సమయంలో మొన్నటి ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేసిన పవన్ రెండుచోట్లా ఓడిపోయిన విషయం తెలిసిందే. తాను పోటీచేస్తేనే గెలవని పవన్ ఇక తన ఓటుతో పార్టీ అభ్యర్ధిని గెలిపించగలరా ? అనే చర్చ జరుగుతోంది. మరి ఫలితాల్లో కానీ పవన్ ఓటు మహిమ ఏంటో తెలీదు.