టీడీపీపై క్లారిటి వస్తుందా ?

Update: 2021-09-18 10:30 GMT
చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పరిషత్ ఎన్నికల కౌంటింగ్ ఈనెల 19వ తేదీన జరగనుంది. కౌంటింగ్ రోజున తెలుగుదేశం పార్టీ పరిస్థితి పై క్లారిటి వచ్చే అవకాశం ఉంది. వైసీసీ ఎలాగూ క్లీన్ స్వీప్ చేసే అవకాశాలున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిందో పరిషత్ ఎన్నికల్లో కూడా అదే సీన్ రిపీటవుతుందని వైసీపీ నేతలు ధీమాగా ఉన్నారు. నిజానికి పరిషత్ ఎన్నికలను చంద్రబాబు నాయుడు బహిష్కరించినట్లు ప్రకటించారు.

ఎన్నికలను టీడీపీ బహిష్కరించింది కాబట్టి పోటీ ఎలాగూ వన్ సైడనే చెప్పాలి. కాకపోతే చంద్రబాబు ప్రకటనతో కొందరు నేతలు విభేదించారు. అనంతపురం జిల్లాలో జేసీ బ్రదర్స్ మద్దతుదారులు కొన్ని చోట్ల పోటీ చేశారు. అలాగే కర్నూలు, చిత్తూరు, విశాఖపట్నం లాంటి జిల్లాల్లో కొందరు సీనియర్ నేతల మద్దతుదారులు పోటీచేశారు. ఎలాగూ టీడీపీ ఎన్నికలను బహిష్కరించింది కాబట్టి పోటీ చేసిన వారంతా ఇండిపెండెంట్ గానే నామినేషన్లు వేశారు.

పేరుకు ఇండిపెండెంట్లే కానీ ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని  టీడీపీ అభ్యర్ధులుగానే పూర్తిచేశారు. అయితే పోటీ చేసిన వారిలో ఎవరైనా గెలిస్తే టెక్నికల్ గా వారంతా ఇండిపెండెంట్లు అవుతారే కానీ టీడీపీ మాత్రం కాదు. మరి ఇలాంటి వారిలో ఎంతమంది గెలుస్తారు అన్నదే ఇక్కడ అసలైన పాయింట్. పార్టీపరంగా అయితే గెలిచే అవకాశాలు దాదాపు లేదనే చెప్పాలి. కాబట్టి స్వతంత్రులుగా అయినా ఎవరైనా గెలుస్తారా అనే డౌటు పెరిగిపోతోంది.

ఇలా గెలిచేవారి సంఖ్యతోనే పార్టీ పరిస్ధితిపై ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంది. పార్టీగా టీడీపీ గెలవక, ఇండిపెండెంట్లుగాను గెలవకపోతే వారంతా ప్రజాధరణ కోల్పోయినట్లే అనుకోవాలి. పైగా అధికారంలో ఉన్నపుడు ఎలాగున్నాయో ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా నేతల మధ్య అభిప్రాయాబేదాలు పెరిగిపోతున్నాయి. ఎవరిని కూడా కంట్రోల్ చేసే సీన్ చంద్రబాబుకు లేదన్న విషయం అందరికీ తెలిసిందే. దానికితోడు కష్టాల్లో ఉన్న సమయంలో నేతలపై యాక్షన్ తీసుకుంటే అది మరింత డ్యామేజికి దారితీస్తుంది. ఏదేమైనా కౌంటింగ్ రోజున పార్టీ పరిస్ధితిపై ఎలాంటి క్లారిటి వస్తుందో చూద్దాం.
Tags:    

Similar News