• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బాబు మళ్ళీ సీఎం అయినా...?

బాబు మళ్ళీ సీఎం అయినా...?

By - Tupaki Desk
Update: 2021-11-28 15:30 GMT
ఏపీ పదమూడు జిల్లాల విభజన రాష్ట్రం. ఉమ్మడి ఏపీలో అంతా ఏపీ గురించే చర్చించేవారు. నాడు సంపన్న ప్రాంతంగా చెప్పుకునే వారు. అయితే అదంతా బంగారు కొండ లాంటి భాగ్యనగరం పుణ్యమా అని వచ్చిన వెలుగు జిలుగులే తప్ప వేరేగా ఏపీని చూస్తే ఏమీ లేదన్నది ఏడేళ్ల చరిత్ర చెబుతోంది. ఏపీ విషయంలో ఇపుడు తలచుకుంటేనే గుండె చెరువు అయ్యేలా ఉందని అంటున్నారు. నిజమే ఏపీ అప్పుల కుప్ప. ఇది కూడా చిన్న మాటే. ఏపీ అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్న రాష్ట్రం. ఈ మాట అంటే ఈ రోజుకు కరెక్ట్. ఎందుకంటే రేపటికి ఇంకా దారుణంగా పరిస్థితులు ఉంటాయని అంచనా వేస్తున్నారు కాబట్టి.

ఇదిలా ఉంటే ఏపీ అప్పు అక్షరాలా ఆరు లక్షల 22 వేల 599 కోట్ల రూపాయలు. ఇప్పటికి జగన్ ఏలుబడి సగం మాత్రమే పూర్తి అయింది. ఇంకా మరో సగం పూర్తి కావాలి. జగన్ ప్రభుత్వం ఈ రోజుకు మూడు లక్షల కోట్ల అప్పు తెచ్చింది అన్నది ఆర్ధిక ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారు ఆధారాలతో సహా చెబుతున్న మాట. అంటే జగన్ పాలన పూర్తి అయ్యేసరికి కచ్చితంగా మరో మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయాల్సిందే.  దాని మీద వడ్డీలు, చక్రవడ్డీలు కలిపితే కచ్చితంగా పది లక్షల కోట్లతో 2024 ఎన్నికలలో గెలిచే పార్టీకి ఏపీ అధికారం బదలాయింపు జరుగుతుంది.

మరి చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో నేను గెలిచి సీఎం గానే అసెంబ్లీలో అడుగుపెడతాను అంటూ భీషణ ప్రతిజ్ఞ చేసి మరీ బయటకు వచ్చారు. ఒక విధంగా జగన్ పాలన విషయంలో ఆయనకు ఏ అడ్డూ లేకుండా చేసి మరీ వచ్చారన్న మాట. మరి చంద్రబాబు తన బాధ్యతను ఇక్కడే విస్మరించారు అని అందరూ అంటున్నారు. జగన్ సర్కార్ ని కనీసం కట్టడం చేయగల అవకాశం  ఒక్క చంద్రబాబుకే ఉంది. చంద్రబాబు మాట జగన్ వింటారా లేదా అన్నది పక్కన పెడితే ఆ విధంగా ఎక్కడికక్కడ  చెక్ చెప్పినట్లైతే జనం దృష్టిలో అయినా బాబుకు నైతికత పెరిగేది.

కానీ మరో రెండున్నరేళ్లు ఈ రాష్ట్రాన్ని ఏం చేసుకుంటారో చేసుకోండి నేనొచ్చి అన్నీ చక్కదిద్దుతాను అన్నట్లుగా బాబు బాయ్ కాట్ చేసేశారు. ఒక వేళ బాబు అనుకుంటున్నట్లుగా టీడీపీ 2024 ఎన్నికల్లో గెలిస్తే ఆయన సీఎం అయి కూడా పది లక్షల కోట్ల అప్పుతో నిలువుగా ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని ఏమి ఉద్ధరించగలరు అన్న ప్రశ్న అయితే మేధావులతో పాటు అందరిలో కలుగుతోంది. చంద్రబాబుకు ఏమైనా మ్యాజిక్కులు  తెలుసా. ఏపీలో అప్పులన్నిటినీ ఒక్క దెబ్బకు అలా మాయం చేయగలరా అన్న చర్చ కూడా నడుస్తోంది.

నిజానికి తానే అపర మేధావిని అని చెప్పే చంద్రబాబే  రెండున్నర లక్షల కోట్లు అప్పు తన  అయిదేళ్ల కాలంలో చేశారు. జగన్ పాలన సగానికి వచ్చేసింది. కొత్త అప్పు పుట్టే చాన్సే లేదు. అయినా ఉన్నవీ లేనివీ అన్నీ తాకట్టు వాకట్టు పెట్టి ఎలాగో జగన్ తన పాలన పూర్తి చేస్తారనుకుంటే అపుడు బాబు వచ్చి దివాళా పూర్తిగా తీసిన ఏపీని ఎలా కాపాడగలరు అన్న డౌట్లు అయితే అందరిలో ఉన్నాయి.  మొత్తానికి ఏపీని బాబే కాదు, మోడీ వచ్చి సీఎం సీట్లో కూర్చున్నా బాగు చేయలేడు అన్న బాధతో కూడిన సందేహాలైతే జనాలకు  వస్తున్నాయి. మరి ఏపీని బాగు చేయడం మాట దేముడెరుగు కనీసం ఇలాగైనా ఉంచే శక్తి పాలకులకు ఉందా అన్నదే డౌట్.
Tags:    
  • Nara Chandrababu naidu 
  • TDP 
  • Andhrapradesh 
  • Latest News 
  • Telugu News 
  • Tupaki Updates 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS