• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  చంద్రబాబు ప్రయోగం సక్సెస్...

చంద్రబాబు ప్రయోగం సక్సెస్ అవుతుందా ?

By - Tupaki Desk
Update: 2021-11-07 07:30 GMT
పుట్టి పెరిగిన నియోజకవర్గంలో చంద్రబాబునాయుడు ప్రయోగం చేయబోతున్నారు. రాబోయే ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుండి రెడ్డి సామాజికవర్గానికి చెందిన అభ్యర్ధిని రంగంలోకి దింపబోతున్నారు. చంద్రగిరిలో  2009లో టీడీపీ తరఫున రెడ్డి సామాజికవర్గానికి చెందిన రోజా పోటీ చేసినా లెక్కలేదు. ఎందుకంటే అప్పట్లో గాలి ముద్దుకృష్ణమనాయుడు కోసం చివరి నిముషంలో రోజాను నగిరి నుండి చంద్రగిరికి చంద్రబాబు షిఫ్ట్ చేశారు.

కాబట్టి అప్పట్లో రోజా పోటీని పార్టీ నేతలే సీరియస్ గా తీసుకోలేదు.  కానీ రాబోయే ఎన్నికల్లో ఇక్కడినుండి మబ్బు దేవనారాయణరెడ్డి (పెదబ్బ)ని రంగంలోకి దింపాలని చంద్రబాబు ఇప్పటికే డిసైడ్ అయిపోయారు. ఇదే విషయాన్ని పెద్దబ్బకు చంద్రబాబు చెప్పటం అతను కూడా పోటీకి రెడీఅయిపోవటం అన్నీ జరిగిపోయింది. నియోజకవర్గాల పునర్విభజనలో తిరుపతి రూరల్ మండలం చంద్రగిరి నియోజకవర్గంలో కలిసింది.

తిరుపతి రూరల్ మండలంలో మాజీ ఎంఎల్ఏ, పెద్దబ్బ తండ్రి మబ్బు రామిరెడ్డికి మంచి పట్టుంది. ఈ మండలంపై మొదటినుండి రెడ్లదే ఆధిపత్యం. ఇపుడెలాగు ఈ మండలం చంద్రగిరి నియోజకవర్గంలో కలిసుంది కాబట్టి తనకు బాగా అడ్వాంటేజ్ అవుతుందని పెద్దబ్బ అనుకుంటున్నారు. ఇదే పాయింట్ మీద చంద్రబాబు కూడా పెద్దబ్బను తిరుపతి కాకుండా చంద్రగిరిలో పోటీచేసేట్లు ఒప్పించారు. పెద్దబ్బకు ఆర్ధికంగా పూర్తి మద్దతు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారట. దాంతో పెద్దబ్బ కూడా చంద్రగిరిలో పోటీకి రెడీ అయిపోయారు.

అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే వైసీపీ తరపున ఎంఎల్ఏ చెవిరెడ్డి భాస్కరరెడ్డి బాగా పాతుకుపోయారు. అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాల అమలులో చెవిరెడ్డి బాగా యాక్టివ్ గా ఉన్నారు. ప్రధానంగా చెవిరెడ్డికి కలిసొచ్చే అంశం ఏమిటంటే క్యాడర్ తో పాటు జనాలకు బాగా యాక్సెస్ ఉంటుంది. ఎప్పుడూ జనాల్లోనే తిరుగుతుంటారు. కరోనా వైరస్ ఉధృతంగా ఉన్న కాలంలో కూడా కరోనా కిట్లను రెండుసార్లు నియోజకవర్గమంతా సొంతఖర్చుతో పంపిణీ చేశారు.

అలాగే ఆనందయ్య ఆయుర్వేధం మందును నియోజకవర్గంలో పంపిణీ చేశారు. జనాల్లో కానీ క్యాడర్లో కానీ చెవిరెడ్డిపై పెద్దగా వ్యతిరేకత కూడా లేదు. ఏ మండలంపైన అయితే పెద్దబ్బ దృష్టి పెట్టారో అదే తిరుపతి రూరల్ మండలంలో చెవిరెడ్డికి కూడా పట్టుంది. ఈ మండలం కాకుండా చంద్రగిరిలోని ఇతర మండలాల్లో కూడా పట్టుంది. మరి ఈ నేపధ్యంలోనే చంద్రబాబు చేస్తున్న రెడ్డి ప్రయోగం సక్సెస్ అవుతుందా ? అనే చర్చ పార్టీలో జరుగుతోంది.
Tags:    
  • Nara Chandrababu naidu 
  • TDP 
  • Andhrapradesh 
  • Latest News 
  • Telugu News 
  • Tupaki Updates 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS