• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కుప్పం పిలుస్తోంది బాబూ...

కుప్పం పిలుస్తోంది బాబూ ...!

By - Tupaki Desk
Update: 2021-10-11 15:30 GMT
అది ఏపీకి దూరంగా పొరుగు రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ప్రాంతం. దాని గురించి ఎవరికీ బొత్తిగా పట్టని రోజులలో చంద్రబాబునాయుడు అక్కడికి వెళ్లారు. ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున  పోటీ చేశారు. అంతే కుప్పం పేరు ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా మారుమోగింది. వైఎస్సార్ ఫ్యామిలీకి పులివెందుల ఎలాగో బాబుకు కుప్పం అలాగా అన్నట్లుగా పొలిటికల్ గా గొప్పగా తమ్ముళ్ళు చెప్పుకునేవారు. మూడు దశాబ్దాలకు పైగా నారా ఫ్యామిలీని ఆదరిస్తోంది కుప్పం. చంద్రబాబు ఏ రోజు కూడా  ఎమ్మెల్యే అభ్యర్ధిగా స్వయంగా వెళ్ళి నామినేషన్ దాఖలు చేయలేదు అక్కడ. అయినా కానీ అరలక్షకు తక్కువ కాకుండా మెజారిటీ ఇచ్చి గెలిపించిన పుణ్యం అంతా కుప్పం ప్రజలదే.

అలాంటి కుప్పం కోటలు బీటలు వారాయి. 2019 ఎన్నికల్లో బాబు మెజారిటీ ఏకంగా ముప్పయి వేల మెజారిటీకి పడిపోయింది. అది కూడా కొన్ని రౌండ్లలో చంద్రబాబు వెనకబడి మరీ తమ్ముళ్లకు తెగ టెన్షన్ పుట్టించారు. మొత్తానికి కుప్పంలో గెలిచి బాబు విజయ బావుటా ఎగరేసినా ఏపీలో టీడీపీ దారుణంగా ఓడింది. ఇక గత రెండున్నరేళ్ళుగా బాబు కుప్పం వెళ్ళింది తక్కువే. దాంతో  కుప్పంలో లోకల్ బాడీ ఎన్నికలతో పాటు అన్నీ కూడా వైసీపీకి జై కొట్టేశాయి. అంతే చంద్రబాబులో ఒక్కసారిగా కలవరం చెలరేగిందనే అంటున్నారు. ఇక కుప్పం టూర్ తప్పదని కూడా నిశ్చయానికి  వచ్చారు.

ఈ మధ్యనే అంటే పంచాయతీ ఎన్నికల తరువాత మూడు రోజుల టూర్ చేసిన బాబు మరో విడతగా మళ్ళీ అక్కడికి వెళ్తున్నారు. ఈసారి కూడా మూడు రోజుల ప్రోగ్రాం ఉంది. అన్నీ ప్రాంతాలు కవర్ అయ్యేలా బాబు షెడ్యూల్ ఉంది. కుప్పం ప్రజలతో పాటు పార్టీ క్యాడర్ ని కూడా దగ్గర పెట్టుకుని ముచ్చటించేందుకు బాబు సిద్ధపడుతున్నారు. మొత్తానికి బాబు ఇన్నాళ్ళకు నెలల తేడాలో వరసబెట్టి తమ ప్రాంతానికి రావడం పట్ల కుప్పం జనాలు సంతోషిస్తున్నారు. దానికి తమ ఓటు దెబ్బ పవరే కారణమని కూడా భావిస్తున్నారు. ఇక కుప్పంలో అభివృద్ధి పనులను ఒక వైపు వైసీపీ జోరుగా చేస్తోంది. బాబు ఈ టైమ్ లో విపక్ష నేతగా వరాలే ఇవ్వగలరు తప్ప ఏమీ చేయలేని స్థితి. దాంతో ఆయన పర్యటనల జోరు పెంచినా కుప్పం జనాలు మారుతారా, ఏమారుతారా అన్నది చూడాలి. ఏది ఏమైనా బాబుకు కుప్పం పదే పదే పిలుస్తోంది. ఆ విధంగా ఇన్నాళ్ళూ ఆయన్ని ఎమ్మెల్యేను చేసిన కుప్పం తొలిసారిగా తాను గెలుస్తోంది.
Tags:    
  • Nara Chandrababu naidu 
  • TDP 
  • Andhrapradesh 
  • Latest News 
  • Telugu News 
  • Tupaki Updates 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS