భార్య ముందే ప్రియురాలితో సెక్స్ ... భార్య ఆత్మహత్య !

Update: 2020-02-12 01:30 GMT
పెళ్లి ..జీవితం ఒకేసారి జరిగే ఈ వేడుక గురించి ప్రతి అమ్మాయి కూడా ఎన్నో కలలు కంటుంది. పెళ్లి తరువాత తమ జీవితం అలా ఉండాలి , ఇలా ఉండాలి అని ఎన్నో ఊహలతో అత్తవారింట్లో అడుగుపెడుతుంది. కానీ , ప్రస్తుత సమాజంలో పెళ్లి అయ్యి అత్తవారింట్లో అడుగుపెట్టిన ఆడపిల్ల పెళ్ళికి కళ్ళకి పూసిన పసుపు , పారాణి ఆరకముందే చిత్రహింసలకు గురౌతోంది. కట్నం కోసం కొందరు , మద్యానికి బానిసై కొందరు అక్రమ సంబంధాలతో మరి కొందరు కట్టుకున్న భార్యలని వేధిస్తున్నారు. వేదమంత్రాల నడుము , మూడు మూళ్ళ బంధం తో ఒక్కటైనా ఏ జంట లోని భార్య అయినా కూడా తన భర్త మరో అమ్మాయి తో శృంగారం చేస్తుంటే సహించలేదు. కానీ , ప్రస్తుతం అలంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి విశాఖలో జరిగింది. తన భర్త తన కళ్ళముందే మరో అమ్మాయి తో సెక్స్ చేయడాన్ని చూసి సహించలేని ఆ మహిళా ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు విడిచింది.

ఈ సంఘటన విశాఖ జిల్లా నక్కపల్లిలో జరిగింది. డి.కొత్తూరుకు చెందిన నాగవెంకట వరలక్ష్మికి (28) నక్కపల్లికి చెందిన కొప్పిశెట్టి చినరాజుతో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి పెళ్ళై ఏళ్లు గడుస్తున్నా కూడా పిల్లలు పుట్టలేదు. దీంతో చినరాజు ఆమెను పట్టించుకోవడం మానేసి మరో మహిళ తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. పిల్లలు పుట్టలేదు అన్న నెపం తో అత్తమామలు కూడా ఆమెని ఎన్నో అనరాని మాటలు అన్నారు. శనివారం రాత్రి తన ప్రియురాలిని ఇంటికి తీసుకొచ్చి భార్య ఎదుటే గదిలోకి వెళ్లి రాసలీలలు కొనసాగించాడు. దీంతో సహించలేకపోయిన వరలక్ష్మి భర్తతో గొడవ పడింది. ఆవేశంలో మేడ పైకి వెళ్లి దూకేసింది. దీంతో ఆమెను చినరాజు తుని ఆస్పత్రికి తీసుకెళ్తూ తిట్టి చేయి చేసుకున్నాడు. దీంతో వరలక్ష్మి మనస్తాపానికి గురైంది.

అదృష్టవశాత్తూ ఆ గండం నుండి ప్రాణాలతో బయటపడింది. అయినప్పటికీ తన భర్త లో మార్పు రాకపోవడంతో , దాన్ని భరించలేకపోయిన వరలక్ష్మి ఈసారి ఉరేసుకొని ప్రాణాలు తీసుకుంది. ఆత్మహత్యకు ముందు తన అక్కకు విషయం మొత్తం చెప్పింది వరలక్ష్మి. తన మృతికి భర్త, అత్త, భర్త ప్రియురాలే కారణమని అక్కతో చెప్పింది. వరలక్ష్మి అక్క ఫిర్యాదు మేరకు చినరాజు కుటుంబం పై పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నారు.
Tags:    

Similar News