ఎఫ్‌సీఆర్ఏ బిల్లు నెగ్గుతుందా... ఎంత మెజారిటీ కావాలి ?
కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఆర్ఏ బిల్లుని ఈ సమావేశాల్లో పెట్టి ఆమోదించుకోవాలని చూస్తోంది. ఈ బిల్లు చట్టంగా చేయాలని గట్టి పట్టుదలగా ఉంది.
కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఆర్ఏ బిల్లుని ఈ సమావేశాల్లో పెట్టి ఆమోదించుకోవాలని చూస్తోంది. ఈ బిల్లు చట్టంగా చేయాలని గట్టి పట్టుదలగా ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం తెస్తున్న ఈ బిల్లు విషయంలో విపక్షాలు అయితే సుముఖంగా లేవు అవి ఎఫ్‌సీఆర్ఏ బిల్లుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.ఎఫ్ సీఆర్ఎ అంటే విదేశీ విరాళాల నియంత్రణ చట్టం బిల్లు ఆమోదం వద్దు అంటున్నాయి. ఈ బిల్లులో విధించిన అనేక నిబంధనల వల్ల స్వచ్ఛంద సంస్థలు ఎంజీవోలు ఇబ్బందులు పడతాయని చెబుతున్నాయి. అంతే కాదు రాజకీయ కక్ష సాధింపులకు ఈ చట్టాన్ని వాడుకునే అవకాశం ఉందని కూడా వాదిస్తున్నాయి. ఇదంతా కేంద్రం పారదర్శకత పేరుతో ఎన్జీవోల హక్కులను అణచివేస్తోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
కచ్చితంగా బిల్లు :
అయితే బీజేపీ మాత్రం ఈ వర్షాకాల సమావేశాలలోనే ఎఫ్‌సీఆర్ఏ బిల్లుని ప్రవేశపెట్టి ఆమోదించుకోవాలని పట్టుదలగా ఉంది. అసలే డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందలేదు, అలాగే మహిళా బిల్లు పెండింగులో ఉంది. దాంతో ఈ కీలకమైన బిల్లు ఎఫ్‌సీఆర్ఏ అయినా ఆమోదం చేసుకోవాలని చూస్తోంది. అయితే ఈ బిల్లు లోక్ సభ రాజ్యసభలో నెగ్గుతుందా ఒకవేళ నెగ్గితే ఎంత మెజారిటీ ఉండాలి అన్నది కూడా చర్చకు వస్తోంది. సాధారణంగా పార్లమెంటులో ఎలాంటి చట్ట సవరణ బిల్లు అయినా నెగ్గడానికి ఉభయ సభలలో హాజరై ఓటు వేసిన సభ్యులలో సాధారణ మెజారిటీ అంటే యాభై శాతం 50 పై చిలుకు ఉంటే సరిపోతుంది. అయితే విదేశీ విరాళాల నియంత్రణ చట్ట సవరణ రాజ్యాంగ సవరణ బిల్లు కాదు కాబట్టి దీనికి మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం లేదు. దాంతో ఎఫ్‌సీఆర్ఏ బిల్లు ప్రస్తుత పార్లమెంటులోనే చర్చకు పెట్టి ఆమోదించుకోవాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోంది.
మంచికే ఈ బిల్లు :
ఇక ఈ బిల్లు గురించి కేంద్ర ప్రభుత్వం అంతా మంచికే అని అంటోంది. ఈ బిల్లు విదేశీ నిధుల దుర్వినియోగం అరికట్టడంతో పాటు పారదర్శకతను పెంచడం లక్ష్యంగా ప్రవేశపెట్టబడింది. అని చెబుతోంది. ప్రపంచీకరణ నేపధ్యంలో ఆర్థిక వనరుల రాకపోకలను మార్చివేసింది. అంతర్జాతీయ విరాళాలు అభివృద్ధి భాగస్వామ్యాలు ఇలా అన్నీ పెనవేసుకుని పోయాయి. ప్రపంచవ్యాప్తంగా విద్య, ఆరోగ్య సంరక్షణ, విపత్తు సహాయం, శాస్త్రీయ పరిశోధన, పర్యావరణ పరిరక్షణ సమాజ అభివృద్ధికి అనేక దేశాలు ఆర్ధికంగా మద్దతు ఇస్తున్నాయి. ఇటువంటి సహకారాల వల్ల భారతదేశం కూడా ఇప్పటికే ఎంతగానో ప్రయోజనం పొందింది. దేశ సామాజిక, ఆర్థిక అభివృద్ధికి దోహదపడే కార్యకలాపాల కోసం వేలాది సంస్థలు విదేశీ విరాళాలను అందుకున్నాయి.
పారదర్శకత ఉండాల్సిందే :
అయితే విదేశీ విరాళాల విషయలో పెద్ద ఎత్తున వచ్చే అవకాశాలతో పాటు దేశాల సరిహద్దుల మీదుగా జరిగే ఆర్థిక విరాళాల వ్యవహారాలు సైతం పారదర్శకంగా జవాబుదారీగా ఉండేలా చూడాల్సిన అవసరాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు గుర్తిస్తున్నాయి. అందుకే అనేక ప్రజాస్వామ్య దేశాలలో విదేశీ ఆర్థిక ప్రవాహాల నియంత్రణ అన్నది జరుగుతోంది. ఈ క్రమంలోనే విదేశీ విరాళాల నియంత్రణ చట్టాన్ని దాని విస్తృత అంతర్జాతీయ నేపథ్యంలో అర్థం చేసుకోవాలి. చట్టబద్ధమైన స్వచ్ఛంద కార్యకలాపాలను పరిమితం చేయడానికి బదులుగా ఈ చట్టం నిజమైన అంతర్జాతీయ సహకారానికి వీలు కల్పించే ఒక చట్టపరమైన చట్రాన్ని అందిస్తుందని కేంద్రం చెబుతోంది.
కట్టుదిట్టంగానే అన్నీ :
అదే సమయంలో, విదేశీ విరాళాలు భారత చట్టానికి అనుగుణంగా స్వీకరించబడతాయని అలాగే వినియోగించబడతాయని లెక్కించబడతాయని కూడా ఈ చట్టం చెబుతోంది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం అనేది భారతీయ వ్యక్తులు సంఘాలు స్వచ్ఛంద సంస్థలు ట్రస్టులు కంపెనీలు భారతదేశం వెలుపల ఉన్న మూలం నుండి వారికి పంపబడిన డబ్బు, సెక్యూరిటీలు వస్తువులను ఎలా స్వీకరించవచ్చు ఎలా ఉపయోగించవచ్చు అనే దానిని నియంత్రించే చట్టం. దీనిని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది.