ఏడాదిగా సంసారం చేయడం లేదు .. ఎన్నారై భర్త పై భార్య కేసు !
ఎన్నారై అంటే చాలు , వెనుకా ముందు చూసుకోకుండా ఆడపిల్లల తల్లిదండ్రులు సంబంధం ఫిక్స్ చేస్తున్నారు. ఇంత కంటే మంచి పెళ్లి సంబంధం మళ్లీ మనకి దొరకదు అని భావించి, అడిగినంత కట్నం ఇచ్చి చాలా ఘనంగా పెళ్లిచేస్తున్నారు. ఎన్నారై అల్లుడు కదా అని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. అయితే కోటి ఆశలతో కూతురి పెళ్లి చేసి , అల్లుడి తో సహా కూతురిని ఫారెన్ కి పంపిన తర్వాత అసలు రూపాన్ని చూపించడం స్టార్ట్ చేస్తున్నారు. కొందరు భార్యలను చిత్రహింసలకు గురి చేస్తున్నారు. విదేశీ చట్టాలు, స్వదేశీ చట్టాల్లో ఉన్న లొసుగుల కారణంగా భార్యలని పుట్టింట్లో వదిలేసి తప్పించుకుంటున్నారు. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ ఎన్నారై భర్త చేస్తున్న ఆగడాలను గురించి ఓ మహిళ కేసు పెట్టిందట.
వివరాల్లోకి వెళ్తే .. ఈ ఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరం గోటా ప్రాంతానికి చెందిన ఓ మహిళకు 2016వ సంవత్సరంలో ఎన్నారైతో పెళ్లి జరిగింది. 2017వ సంవత్సరంలో ఆ జంట అహ్మదాబాద్ నుంచి దుబాయికి వెళ్లిపోయింది. అప్పటి వరకు బాగానే భార్యను చూసుకున్న భర్త, దుబాయికి వెళ్లిన తర్వాత తన అసలు రూపం చూపించాడట . ఆమెను అదనపు కట్నం కోసం వేధించడం మొదలు పెట్టాడని , ప్రతిరోజూ పీకల మద్యం తాగి వచ్చి ప్రతీరోజూ ప్రత్యక్ష నరకం చూపించేవాడని , ఫోన్ ను కూడా అందుబాటులో ఉంచేవాడు కాదు అని , దేశం కాని దేశానికి తీసుకెళ్లి కనీసం తన వాళ్లతో మాట్లాడుకునే స్వేచ్ఛను కూడా కల్పించేవాడు కాదని ఆమె ఆరోపణలు చేస్తుంది. ఇక ఈ ఏడాది మార్చి నెలలో దుబాయి నుంచి ఆమెను భారత్ కు తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఆమెను పుట్టింట్లో వదిలేసి వెళ్లిపోయాడట. అలా ఇంట్లో వదిలి వెళ్లిన తర్వాత ఎన్ని ఫోన్లు చేసినా పట్టించుకోవడం లేదట. దీనితో ఆ భార్య అహ్మదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిందట. మన ఈ దేశంలో ఉన్న సమయంలో నన్ను బంగారంలాగా చూసుకున్నాడు. ఏమయిందో ఏమో కానీ దుబాయికి వెళ్లిన తర్వాత మాత్రం మారిపోయాడు. నాకు ప్రతిరోజూ నరకం చూపించేవాడు. ఏడాది కాలంగా నాతో కనీసం శృంగారం లో కూడా పాల్గొనడం లేదని , నాకు అనారోగ్యం వచ్చినా, పాపకు ఆరోగ్యం బాగాలేకున్నా పట్టించుకునేవాడు కాదని , అదనపు కట్నం తెచ్చి ఇస్తేనే కాపురం చేస్తాననీ, మిమ్మల్ని పట్టించుకుంటానని అనేవాడని, నాకు బలవంతంగా బీరు తాగించేవాడని , చివరకు రెండేళ్ల వయసున్న కూతురికి కూడా బలవంతంగా బీరు తాగించాడని ఆ భార్య తన ఎన్నారై భర్త పై ఆరోపణలు చేస్తుంది.