ఏటీఎంలు ఎందుకు ఖాళీ అవుతున్నాయి..

Update: 2016-11-12 12:30 GMT
దేశంలో కరెన్సీ విషయంలో మారిన నిబంధనలతో జనం అష్టకష్టాలు పడుతున్నారు. రెండు రోజులు పూర్తిగా మూతపడిన తరువాత మళ్లీ తెరుచుకున్న ఏటీఎంలు జనాల తాకిడి క్షణాళ్లో ఖాళీ అవుతున్నాయి. ఎందుకింత వేగంగా అవి ఖాళీ అవుతున్నాయి... అసలు ప్రభుత్వం ఎందుకు రూ.2 వేలు మాత్రమే డ్రా చేయాలనే సీలింగ్ పెట్టిందన్న విషయం తెలుసా... దానికి కారణం చాలా సింపుల్.. అది వంద నోటు ప్రభావం.

    ఇంతకు ముందు ఏటీఎంలలో రూ.1000 - రూ.500 నోట్లను ఉంచేవారు. ఒక్కో ఏటీఎంలో నాలుగు క్యాష్ ట్రేలు ఉంటాయి. ఒక్కోదానిలో 22 కరెన్సీ ప్యాకెట్లను ఉంచవచ్చు. ఒక్కో ప్యాకెట్లో 100 నోట్లు ఉంటాయి. అంటే 88 ప్యాకెట్లు కూడా రూ.వెయ్యి నోట్లవి అయితే గరిష్ఠంగా ఒక ఏటీఎంలో 88 లక్షలు పడతాయి. కానీ ఇప్పుడు ఇప్పుడు ఏటీఎంలలో కేవలం రూ.100 నోట్లనే ఉంచడం వల్ల వాటిలో గరిష్టంగా రూ. 8.8 లక్షలు ఉంచడానికి మాత్రమే వీలవుతుంది. అంటే పదో వంతు సొమ్మును మాత్రమే ఏటీఎంలలో ఉంచగల్గుతున్నారు. రూ.2 వేల నోట్లను బ్యాంకుల్లో ఇస్తున్నా.. వాటిని ఏటీఎంల ద్వారా అప్పుడే జారీ చేయడం కుదరడం లేదు.

దీంతో ఎక్కువ మంది అందించాలనే ఉద్దేశంతో రూ.2 వేల లిమిట్ పెట్టారు. అంటే అందరూ రూ.2 వేలు చొప్పున డ్రా చేస్తే కేవలం 440 మందికి మాత్రమే సరిపోతుంది. అందుకే పైగా నగదు లభ్యత లేకపోవడంతో ముందు జాగ్రత్తగా అందరూ ఏటీఎంల వద్ద బారులు తీరుతున్నారు. దీంతో చూస్తుండగానే ఏటీఎంలు ఖాళీ అవుతున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News