వైసీపీ నేతల్లో హ్యాపీ మూడ్ ఎందుకు మిస్?
2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకొని.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సీఎం జగన్ తన పదవీ కాలంలో సగ భాగాన్ని నేటి (మంగళవారం)తో పూర్తి చేశారు. ఎన్నికల్లో 151 సీట్లలో సంచలన విజయాన్ని సొంతం చేసుకొని తన రాజకీయ ప్రత్యర్థి టీడీపీకి దారుణంగా దెబ్బ తీశారు.
ఈ ఫలితంతో చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ చతికిల పడింది. ఎన్నికల ఫలితాలు వెలువడి.. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రెండున్నరేళ్లు అయినప్పటికీ.. ఇప్పటికి విపక్షం పంజుకోని పరిస్థితి. అదే సమయంలో.. అధికార వైసీపీ శ్రేణులు రెండున్నరేళ్లను విజయవంతంగా పూర్తి చేయటాన్ని సంబరాలు చేసుకోలేని పరిస్థితి నెలకొంది.
ప్రతి చిన్న అంశానికి భారీ ఎత్తున ఫ్లెక్సీలు.. కేక్ కటింగులు చేస్తూ సంబరాలు అంబరాలు అంటేలే వ్యవహరించే శ్రేణులు.. తాజాగా మాత్రం మౌనంగా ఉన్నాయి. ఎందుకిలా? అన్న ప్రశ్నను వేసుకుంటే.. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలే కారణమని చెబుతున్నారు. ఏపీలోని పదమూడు జిల్లాల్లో ఎప్పుడూ లేని రితిలో నాలుగు జిల్లాల్లో (ప్రకాశం.. నెల్లూరు.. చిత్తూరు.. కడప) కురిసిన వర్షాల కారణంగా చోటు చేసుకున్న వరదల తీవ్రత ఎక్కవగా ఉండటం.. గతంలో ఎప్పుడూ చూడని విషాద ఉదంతాలు తాజాగాచోటు చేసుకోవటంతో ఒకలాంటి ఉద్విగ్న వాతావరణం నెలకొందని చెప్పాలి.
రోజుల తరబడి వర్షాలు కురవటం.. వాగులు.. వంకలు వరద నీటితో పోటెత్తుతున్నాయి. వారాల తరబడి విడవకుండా కురుస్తున్న వానలతో.. పంటలు తీవ్రంగా నష్టపోవటమే కాదు.. పలు ప్రాంతాలు జలమయమై.. పెద్ద ఎత్తున నష్టపోయిన పరిస్థితి. ఇలాంటి వేళ.. రెండున్నరేళ్ల కాలాన్ని విజయవంతంగా పూర్తిచేసిన వైనాన్ని సంబరంగా చేసుకోలేని పరిస్థితి నెలకొంది. అందుకే.. వైసీపీ శ్రేణులన్ని స్తబ్దుగా ఉన్నాయని చెప్పాలి.
ఇప్పుడున్న పరిస్థితుల్లో సంబరాల కంటే కూడా సహాయకచర్యలు ముమ్మరంగా చేపట్టాల్సిన అవసరం ఉన్నందున.. రెండున్నరేళ్ల మార్కును ప్రస్తావించటానికి కూడా ఎవరూ ఇష్టపడటం లేదు. దీనికి తోడు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారటం.. ప్రభుత్వ బండిని నడిపించటానికి నిత్యం అప్పులు చేయాల్సి రావటం.. ఆ అప్పుల లెక్కల్ని వివిధ సంస్థలు ప్రశ్నించటం కారణంగా.. వైసీపీ సర్కాు ఇబ్బంది పడుతోంది. మరోవైపు.. మొన్నీ మధ్యన అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలు.. చంద్రబాబు సతీమణిని అసెంబ్లీలో కించపరిచేలా మాట్లాడారంటూ విపక్ష నేత వాపోయి.. అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోవటం తెలిసిందే. ఇలా అన్ని సమస్యలు ఒక్కసారిగా ముసురుకున్న వేళ.. రెండున్నరేళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న అంశాన్నివైసీపీ శ్రేణులు పెద్దగా పట్టించుకోవటం లేదన్న మాట వినిపిస్తోంది.