మిత్రుడు ట్వీట్ చేయ‌లేదు కానీ ఫైర్ బ్రాండ్ చేశాడే!

Update: 2019-06-10 11:12 GMT
తెలంగాణ అధికార‌పక్షానికి.. మ‌జ్లిస్ కు మ‌ధ్య‌నున్న అనుబంధం ఎలాంటిదో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అలాంటి మ‌జ్లిస్ అధినేత అస‌ద్ సొంత సోద‌రుడు త‌మ‌కు అత్యంత స‌న్నిహితుడైన అక్బ‌రుద్దీన్ ఓవైసీ అనారోగ్యానికి గురి కావ‌టం.. మెరుగైన వైద్యం కోసం లండ‌న్ వెళ్ల‌టం తెలిసిందే.

తెలిసిన వారికి ఆరోగ్యం బాగోలేదంటే కాస్తంత కంగారు ప‌డ‌టం మామూలే. అందునా.. దేశంలో ఇన్ని ఆసుప‌త్రులు ఉంటే.. వాటిని వ‌దిలేసి లండ‌న్ కు తీసుకెళ్లారంటే అంతో ఇంతో సీరియ‌స్ అని చెప్ప‌క త‌ప్ప‌దు. దీనికి తోడుగా త‌న త‌మ్ముడి ఆరోగ్యం మెరుగుప‌డాల‌ని అస‌ద్‌.. దేవుడ్ని ప్రార్థించాల‌ని కోర‌టంతో ఈ ఇష్యూకు మ‌రింత ప్రాధాన్య‌త ల‌భించింది.

ఆ మ‌ధ్య‌న క‌త్తిపోట్ల‌కు గురైన నాటి నుంచి అక్బ‌రుద్దీన్ ఓవైసీ ఆరోగ్యం దెబ్బ తిన‌టం తెలిసిందే. ఈ మ‌ధ్య‌న రంజాన్ సంద‌ర్భంగా ఆయ‌న ఆహారం తీసుకోకుండా ఉండ‌టంతో ఆరోగ్య‌ప‌ర‌మైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న‌ట్లుగా చెబుతున్నారు. వాంతులు.. తీవ్ర‌మైన క‌డుపునొప్పి కార‌ణంగా అస్వ‌స్థ‌త‌కు గురైన అక్బ‌రుద్దీన్ లండ‌న్ పంపిన నేప‌థ్యంలో ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్.. మ‌ల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆకాంక్షిస్తూ.. ఒక ట్వీట్ పోస్ట్ చేవారు.

త‌మంద‌రి ఆశీస్సులు అక్బ‌రుద్దీన్ కు ఉన్నాయ‌ని.. వెంట‌నే కోలుకొని తెలంగాణ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై అసెంబ్లీలో గ‌ళ‌మెత్తాల‌ని కోరుకున్నారు. లండ‌న్ లోని ప్రైవేటు ఆసుప‌త్రిలో ఉన్న అక్బ‌రుద్దీన్ నుఉద్దేశించి రేవంత్ ట్వీట్ చేయ‌టం స‌రే.. మ‌రి.. వారికి అత్యంత స‌న్నిహితులు టీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేయక‌పోవ‌టం ఏమిటి?  మామూలుగా అయితే.. ఇలాంటి వాటిల్లో య‌మా యాక్టివ్ గా ఉండే.. కేటీఆర్.. ఈసారి కాస్త ఆల‌స్యం కావ‌టం ఏమిటి..?  మిత్రుడి విష‌యంలో ఇలాంటి ఆల‌స్యాలు బాగోవ‌న్న విష‌యం కేటీఆర్ కు తెలియ‌ని విష‌యాలా..?
Tags:    

Similar News