• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఓటరు దినోత్సవం రోజు...

ఓటరు దినోత్సవం రోజు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు..?

By - Tupaki Desk
Update: 2022-01-25 06:30 GMT
ప్రజాస్వాయ్యం కలిగిన ఏ దేశంలోనైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బాధ్యత ప్రజలపై ఉంటుంది. ఆ దేశంలోని ప్రజలు తమ భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకొని సరైన వ్యక్తులను నాయకులుగా ఎన్నుకుంటారు. ఆ నాయకుల ద్వారా తమ దేశాభివృద్ధిని కాంక్షిస్తారు. మంచి నాయకులు రావాలంటే దేశంలోని 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్క వ్యక్తి ఓటు వినియోగించుకోవాలి. సరైన ఓటు వేసి దేశం అభివృద్ధికి తోడ్పడాలి.  తమ ఓటు ద్వారా అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేయగలుగుతారు. అందుకే వారు వేసే ఓటు అత్యంత ప్రాధాన్యత కలిగింది. అయితే చాలా మందికి ఓటు ఎంత విలువైనదో ఇప్పటికీ అర్థం కావడం లేదు. దీంతో ప్రభుత్వాలు ఓటు ఆవశ్యక్కతను చెప్పే ప్రయత్నం ఎప్పటికప్పుడు చేస్తోంది. భారత్లో 2011 నుంచి ఓటరు దినోత్సవాన్ని జనవరి 25న అధికారికంగా నిర్వహిస్తున్నారు. అయితే జనవరి 25నే ఎందుకు ఎంచుకున్నారు..?

భారత ఎన్నికల సంఘం 1950లో ఏర్పడింది. జనవరి 25న ఎన్నికల కమిషన్ ఏర్పాటైనందున ఈరోజున ఓటరు దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించారు.  2011 జనవరి 25న అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఓటరు దినోత్సవాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది 11వ ఓటరు దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఓటర్లకు ఓటు విలువ తెలియజేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 18 ఏళ్లు నిండి ఓటను నమోదు చేసుకున్న వారికి ఈరోజు గుర్తింపు కార్డులు అందజేయనున్నారు. ఓటు నమోదు చేసుకున్న వారికి గుర్తింపు కార్డులను అందజేస్తారు. వాటి ఆధారంగానే  ఓటు వేయడానికి సాధ్యమవుతుంది. అయితే ఒక్కో సందర్భంగా ఇతర గుర్తింపు కార్డులను కూడా అనుమిస్తారు.

ఓటరు దినోత్సవం సందర్భంగా ప్రతీసారి ఓ థీమ్ ను ఏర్పాటు చరేస్తున్నారు. ఈసారి ‘ఎన్నికలు కలుపుకొని , ప్రాప్యత, పాల్గొనేలా చేయడం అనే థీమ్ ను చేశారు. ఓటరు దినోత్సవాన్ని ప్రజాస్వామ్య పండుగలా భావిస్తారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఓటు విలువ చెబుతారు. ప్రతీ పౌరుడికి భారతదేశం పురోగతి, అభివృద్ధి ఓటు వేయడం ద్వారానే జరుగుతుందని తెలియజెబుతారు. బాధ్యాతయుతమైన ప్రతీ పౌరుడు ఓటు వేయాల్సిందే. ముఖ్యంగా యువత అర్హత వయసు రాగానే ఓటు వినియోగించుకొని దేశం అభివృద్ధికి సహకరించాలని ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నాయి.

ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. తాము ఓటు కచ్చితంగా వేస్తామని ప్రమాణం చేయిస్తారు. కొన్ని పాఠశాలల్లో ఓటు విలువ తెలిపేందుకు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. ఓ పొలింగ్ కేంద్రం లాగా సెట్ చేసి విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. ఇక స్వచ్ఛంద సంస్థలు, ఇతరులు ఓటు అవగాహనపై ర్యాలీలు తీస్తారు. నినాదాలు చేస్తూ ఓటు వినియోగించుకోవాలని కోరుతారు. అయితే కేవలం ఓటరు దినోత్సవం రోజునే కాకుండా ఎప్పుడు ఓటు విలువ కాపాడుకోవాలని సూచిస్తారు.
Tags:    
  • Votersday 
  • january25 
  • electioncommission 
  • politicalnews 
  • tupakiupdates 

Similar News

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

ఛాతీ ఎముక కోయకుండానే బైపాస్ సర్జరీ.. భారతీయ రోబోతో అరుదైన ఆపరేషన్!

2026-11-19 05:32 GMT

Copyright @2026

Powered by Blink CMS