కరోనా తొలి రోగి పై డబ్ల్యూ.హెచ్.ఓ కీలక ప్రకటన

Update: 2021-01-16 11:42 GMT
చైనాలోని వూహాన్ నగరంలో కరోనా పుట్టింది. కరోనా పుట్టినిల్లు ఆ నగరమే.. అక్కడి నుంచి చైనాలోని ఇతర ప్రాంతాలకు.. ఇతర దేశాలకు పాకింది. ప్రపంచాన్ని అతలాకుతలం చేసి లక్షలమందిని చంపేసింది.

అయితే కరోనా ప్రపంచానికి అంటించిన చైనా మాత్రం ఆ దేశంలో వైరస్ ను కట్టడి చేసి చోద్యం చూస్తోంది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా చైనాపై దుమ్మెత్తిపోసినా ఆ దేశం కిక్కురుమనలేదు. ఇప్పటికీ మరోసారి చైనాలో కరోనా వైరస్ ప్రబులుతోంది. లాక్ డౌన్ విధిస్తున్నారు. మొదట కరోనా పుట్టిన వూహాన్ లోకి అంతర్జాతీయ మీడియాను, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్.వో)ను నిషేధించిన చైనా ఇప్పుడు సంవత్సరం తర్వాత పరిస్థితులన్నీ మెరుగయ్యాక అనుమతించింది.

తాజాగా కరోనా వైరస్ మూలాలు కనుక్కునే పనిలో డబ్ల్యూ.హెచ్.వో పడింది. దీనికోసం 10 మంది నిపుణులతో కూడిన డబ్ల్యూ.హెచ్.ఓ బృందం చైనాలోని కరోనా పుట్టినిల్లు వూహాన్ కు చేరుకుంది.

ఈ నేపథ్యంలోనే కరోనా సోకిన తొలి వ్యక్తి 'పేషెంట్ జీరో'ను కనుక్కునే పనిలో పడింది. అయితే కరోనా సోకిన తొలి వ్యక్తిని కనిపెట్టడం అసాధ్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్.వో) పేర్కొంది. ఖచ్చితంగా చెప్పాలంటే ఎప్పటికీ కనిపెట్టలేకపోవచ్చని డబ్ల్యూ.హెచ్.వో వ్యాధుల విభాగం టెక్నికల్ లీడ్ మారియా వాన్ స్పష్టం చేసింది. దీంతో  కరోనా మూలాలు కనుక్కోవడం అసాధ్యమన్న సంగతి తెలిసిపోయింది.
Tags:    

Similar News