గుడ్ న్యూస్: వాట్సాప్ తో ఇక చెల్లింపులు

Update: 2020-11-06 12:30 GMT
స్మార్ట్ ఫోన్ ఇప్పుడు నిత్యవసరం..  ప్రపంచంలోని అందరి చేతుల్లో ఉండే దీంట్లోని వాట్సాప్ లేనిదే పూటగడవని పరిస్థితి. మెసేజ్ లు, ఉద్యోగుల పనులు, కాలింగ్ లు,  సమాచారం అంతా దీని ద్వారానే బట్వాడా జరుగుతోంది. ఇంత నిత్యవసరమైన వాట్సాప్ మరో విప్లవాత్మక చర్యతో ముందుకొచ్చింది.

వాట్సాప్ వినియోగదారులకు గొప్ప శుభవార్త ఇప్పుడు అందింది. ఇకపై ఈ మెసేజింగ్ యాప్ నుంచి డబ్బులు పంపుకోవడం.. పేమెంట్స్ వంటివి చేసుకోవచ్చు.  వాట్సాప్ లో ఆర్థిక కార్యకలాపాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. దశల వారీగా వాట్సాప్ సంస్థ ఈ సేవలను అందుబాటులోకి తెచ్చుకోవచ్చని   నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్.పీ.సీ.ఐ) గురువారం వెల్లడించింది.

కేంద్రం అనుమతులపై ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ఆనందం వ్యక్తం చేశారు. శుక్రవారం నుంచి ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు జుకర్ బర్గ్ ఒక వీడియోలో పేర్కొన్నారు.

‘సూక్ష్మ, చిన్నతరహా వ్యాపారాల్లో కొత్త అవకాశాలను సృష్టిస్తోంది. ఇలాంటి ఘనత సాధించిన తొలిదేశం భారతే. ఇందులో మేము కూడా భాగస్వాములు కావడం.. డిజిటల్ ఇండియాకు మా వంతు సహకారం అందించే అవకాశం రావడం ఆనందంగా ఉంది’ అని ఫేస్ బుక్ సీఈవో జుకర్ బర్గ్ తెలిపారు.

వాట్సాప్ ద్వారా డబ్బు పంపించడం.. సందేశాలు పంపించినంత సులభమని జుకర్ బర్గ్ అన్నారు. వాట్సాప్ చెల్లింపులకు ఎలాంటి చార్జీలు వసూలు చేయట్లేదని.. 140కి పైగా బ్యాంకు ఖాతాల నుంచి పేమెంట్స్ జరుపుకోవచ్చని వెల్లడించారు. పది ప్రాంతీయ భాషల్లో ఈ వాట్సాప్ పేమెంట్స్ అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు.

భారత్ లో వాట్సాప్ పేమెంట్స్ సేవలు నేటి నుంచి అందుబాటులోకి వస్తున్నప్పటికీ యూజర్లందరికీ చెల్లింపులు చేసుకునే అవకాశం ఉండదు. దశల వారీగా అమలవుతుంది. మొదట 2 కోట్ల మంది వాట్సాప్ యూజర్లతో మాత్రమే ఈ సేవలు ప్రారంభం అవుతాయి.
Tags:    

Similar News