• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మీ పిల్లలు మీ మనవళ్లు ఏ...

మీ పిల్లలు మీ మనవళ్లు ఏ మీడియం?

By - Tupaki Desk
Update: 2019-11-11 09:19 GMT
మనం ఒకరికి చెప్పడం తప్పు కాదు ..కానీ , అవతలి వ్యక్తి మనం చెప్పిన దాని కి తిరిగి ఏమైనా అంటే ఆ ప్రశ్న కి మనం సమాధానం చెప్ప గలగాలి. ఆ స్థాయి లో ఉంటే నే మనం ఎదుటి వారిని ప్రశించవచ్చు. మనం ఒక వైపు అదే తప్పు చేస్తూ ..మళ్ళీ పక్కనున్న వారి దగ్గరి కి వెళ్లి నువ్వు చేసేది తప్పు అంటే ..వారు వింటారా చెప్పండి. నువ్వు చేస్తే సంసారం ..నేను చేస్తే వ్యభిచారం అని అడుగుతారు. కాబట్టి మనం దేని గురించైనా మాట్లాడే ముందు .. ఆ విషయం లో మనల్ని ఎదుటువారు ప్రశించకుండా చూసు కోవాలి. కానీ , ఈ విషయం లో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు , జనసేన అధినేత పవన్  కళ్యాణ్ , ఉప రాష్ట్ర పతి వెంకయ్య నాయుడు గారు ఇంకా కొంచెం అభివృద్ధి చెందాలి.  అసలు విరేమన్నారు ..అని అనుకుంటున్నారా ...అక్కడికే వస్తున్నా ..

కొత్త గా అధికారంలోకి వచ్చిన వైసీపీ  ఆంధ్రప్రదేశ్‌ లో ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు ప్రవేశ పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని కొందరు స్వాగతిస్తుంటే ..మరి కొందరు విమర్శిస్తున్నారు. తెలుగు భాష ని కాపాడాలి అని ఒకరు , తెలుగు ని నాశనం చేస్తుంటే ..తెలుగు భాష పరి రక్షణా సమితి ఎక్కడా అని కొందరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఈ వ్యాఖ్యల పై సీఎం జగన్ మోహన్ రెడ్డి తనదైన శైలి లో స్పదించారు.

మౌలానా ఆజాద్‌ జయంతి వేడుక ల్లో పాల్గొన్న సీఎం..  మాట్లాడుతూ... చంద్రబాబు నాయుడు కుమారుడు ఏ మీడియంలో చదివాడు? ఆయన మనవడు ప్రస్తుతం ఏ మీడియం లో చదువుతున్నాడని జగన్ ప్రశించారు. అలాగే  మరో వైపు భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు విమర్శల పై స్పందిస్తూ.. మీ మనవళ్లు ఏ మీడియం స్కూళ్లో చదువుతున్నారంటూ ప్రశ్నించారు. ఇక, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ విమర్శలకు  సమాధానమిచ్చారు సీఎం వైఎస్ జగన్... యాక్టర్ పవన్ కల్యాణ్‌ కు ముగ్గురు భార్యలు, బహుశా నలుగు రో, ఐదుగు రో పిల్లలు అనుకుంటా.. వారంతా ఇప్పుడు ఏ మీడియం స్కూల్‌ లో చదువుతున్నారంటూ కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుత రోజుల్లో ఇంగ్లీష్‌ మీడియం స్కూళ్లల్లో చదివితేనే పోటీ ప్రపంచం లో గెలవ గలరని స్పష్టం చేశారు. అందుకే ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు ప్రవేశ పెడుతున్నామన్న ఆయన. ఆ స్కూల్స్ లో  తెలుగు సబ్జెక్ట్‌ను తప్పనిసరి చేస్తామన్నారు. పేద వాళ్లకు ఇంగ్లీష్‌ మీడియం వద్దంటూ పెద్ద పెద్దవాళ్లు.. చంద్రబాబు, వెంకయ్య నాయుడు లాంటి పెద్దపెద్ద నేతలు.. పవన్ కల్యాణ్ లాంటి పెద్ద పెద్ద యాక్టర్లు స్పందించిన తీరు  బాగా లేదు అని , పేదవారి పిల్లలు ఇంగ్లీష్ మీడియా స్కూల్ లో చదవడం మీకు ఇష్టం లేదా అని ప్రశించారు.
Tags:    
  • Ys Jagan 
  • Venkayya Naidu 
  • Pawan Kalyan 
  • Chandra Babu Naidu 
  • English Medium 
  • Telugu Medium 
  • Andhra News 
  • Andhra Politics 
  • Andhra Pradesh Daily News 
  • Ap News 
  • Tupaki News 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS