బెంగాల్ లో హింసకు కారణమిదే?

Update: 2021-04-11 04:30 GMT
పశ్చిమ బెంగాల్ లో నాలుగో విడత పోలింగ్ సందర్భంగా కూచ్ బెహార్ జిల్లాలో చోటుచేసుకున్న హింసలో నలుగురు చనిపోయారు. కోచ్ బిహార్ జిల్లాలో తృణమూల్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు ఇక్కడ జరిగిన ఓ గొడవలో యువ ఓటు మరణించారు.

కోచ్ బిహార్ లోని సీతల్ కుచిలో గల ఓ పోలింగ్ కేంద్రం ఎదుట గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఆనంద్ బుర్మాన్ అనే యువ ఓటరుపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో ఆ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.ఈ హత్యపై బీజేపీ, టీఎంసీలు పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి. ఘటన వెనుక కాషాయ పార్టీ హస్తం ఉందని టీఎంసీ ఆరోపించింది. మృతుడు తమ పోలింగ్ ఏజెంట్ అని.. అధికార టీఎంసీ నేతలే అతడిపై కాల్పులు జరిపారని బీజేపీ ఆరోపించింది.

ఈ కాల్పుల నేపథ్యంలోనే అక్కడ పోలింగ్ కేంద్రం వద్ద బీజేపీ, టీఎంసీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. బాంబులు విసురుకున్నారు. దీంతో కేంద్ర బలగాలు అక్కడి చేరుకొని ఆందోళనకారులపై లాఠీచార్జ్ చేశారు. పరిస్థితి సద్దుమణగకపోవడం.. బలగాలపైకి నిరసన కారులు రావడంతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు చనిపోయారు. దీంతో కేంద్ర బలగాల కాల్పుల్లో నలుగురు చనిపోయారని టీఎంసీ అధినేత మమతా బెనర్జీ ఫైర్ అయ్యారు. అక్కడి వెళ్లి నిరసన తెలిపేందుకు రెడీ కావడంతో బెంగాల్ అట్టుడుకుతోంది.
Read more!

దీనిపై ఎన్నికల సంఘం స్పందించింది. అనారోగ్యం పాలైన ఓ యువకుడిని ఆస్పత్రికి తరలించేందుకు సీఐఎస్ఎఫ్ సిబ్బంది రెడీ కాగా.. పోలీసులే దాడి చేసి అతడిని తీసుకెళుతున్నారని భావించి గ్రామస్థులు పొరపాటు సీఐఎస్ఎఫ్ మీద దాడి చేశారు. ఎన్నికల అధికారులపై కూడా దాడికి ప్రయత్నించారు. పోలీస్ వాహనాన్ని ధ్వంసం చేశారు.

దీంతో సీఐఎస్ఎఫ్ సిబ్బంది మొదట గాల్లోకి కాల్పులు జరిపారని.. ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో తమ ప్రాణాలను రక్షించుకునేందుకు  గ్రామస్థులపై కాల్పులు జరపాల్సి వచ్చిందని ఈసీ తెలిపింది.

ఈ కాల్పుల్లో నలుగురు మృతి చెందారని ఈసీ వివరించింది. ఏడుగురు గాయాలతో ఆస్పత్రిలో చేరారని తెలిపింది. గాయపడ్డ పోలీసులు, అధికారులను తరలించారు. ప్రస్తుతం అక్కడ భారీగా పోలీసులను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెస్తున్నారు.
Tags:    

Similar News