రఘురామ కాల్ డేటాలో ఏముంది? వాట్సాప్ చాటింగ్ లో ఎవరున్నారు?

Update: 2021-05-17 03:35 GMT
బాధ్యతాయుతమైన ఎంపీ స్థానంలో ఉండి.. ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేయటం.. తాజాగా గుంటూరు జైలుకు తరలించటం లాంటివి తెలిసిందే. ఇప్పటికే ఆయన్ను విచారించిన అధికారులు.. ఇప్పుడు ఆయన వెనుక ఎవరున్నారన్న విషయం మీద ఫోకస్ పెడుతున్నారు. ఇందుకోసం ఆయన వినియోగించిన ఫోన్ కీలకం కానున్నట్లు చెబుతున్నారు.

ఏపీ ప్రభుత్వ ఇమేజ్ ను డ్యామేజ్ చేయటంతో పాటు.. కులాల మధ్య.. వర్గాల మధ్య కుమ్ములాటలు పెట్టటానికి వెనుక ఎవరున్నారు? ఎలాంటి ప్లానింగ్ చేశారన్న అంశంపై సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. ఆయన కాల్ డేటా మీదా అధికారులు ఫోకస్ చేసినట్లు చెబుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం రఘురామ వెనుక విపక్ష నేతలు.. కొందరు ప్రముఖులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

అందుకే.. ఈ విషయాల్ని నిగ్గు తేల్చేందుకు ఆయన మొబైల్ ఫోన్ కాల్ డేటా మీద ప్రత్యేక ఫోకస్ చేస్తున్నట్లు చెబుతున్నారు. అంతేకాదు.. వాట్సాప్ చాటింగ్ ల మీదా సీఐడీ దృష్టి పెట్టింది. రఘురామ ఎవరి సలహాల్ని.. సూచనల్ని అందుకొని నేరాలకు పాల్పడ్డారన్న అంశంపై పోలీసులు విచారిస్తున్నారని చెబుతున్నారు. రానున్న రోజుల్లో దీనికి సంబంధించిన మరిన్ని బ్రేకింగ్ న్యూసులు బయటకు వస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News