రియల్ శివమణికి ఏమైంది.. సడెన్ గా ఆస్పత్రిలో తీవ్ర అస్వస్థతతో ప్రత్యక్షం
రుషీ కేశవ.. చిత్తూరు జిల్లాలో కొన్నేళ్ల పాటు వివిధ పోలీస్ స్టేషన్ లలో పని చేసిన సీఐ. నేరస్తుల పాలిట ఆయన సింహస్వప్నం. ఆయన ఎక్కడ పని చేస్తే అక్కడ అవినీతికి అక్రమాలకు తావు ఉండదు అని ప్రజల్లో పేరు తెచ్చుకున్నారు. రుషీ కేశవ మరో ప్లస్ పాయింట్ ఆయన ఎక్కడ పని చేస్తున్నా ప్రజలతో నేరుగా సత్ సంబంధాలు పెట్టుకుంటారు. నిత్యం ప్రజల్లో తిరుగుతూ సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తుంటారు. ఆయనకు క్రికెట్ కు అంటే ఎంతో ఇష్టం. ఎక్కడ పని చేస్తే అక్కడ స్థానిక యువత తో కలసి టోర్నమెంట్లు నిర్వహిస్తూ ప్రోత్సహిస్తుంటారు. సేవా కార్యక్రమాలు నిర్వహించేలా చైతన్యం తెస్తూ ఉంటారు.
నాగార్జున హీరోగా నటించిన శివమణి సినిమా విడుదలైన సమయంలో ఆయన మొదటి సారిగా చిత్తూరు జిల్లా పుంగనూరుకు వచ్చారు. నీతి నిజాయితీతో పని చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. అక్రమార్కుల పట్ల కఠినంగా వ్యవహరించి శాంతి భద్రతలను పర్యవేక్షించారు. అందుకే ఆయనను అందరూ శివమణి అని పిలిచేవారు. 2008లో ఆయన పుంగనూరు నుంచి ములకలచెరువు సీఐగా బదిలీ కాగా ఆయనను బదిలీ చెయ్యొద్దంటూ స్థానికులు పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. ఆ తర్వాత ఆయన ములకలచెరువు వెళ్ళినా అక్కడ కూడా సేవా కార్యక్రమాలను కొనసాగించారు.
సీఐ అయినప్పటికీ తన పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపి ఆదర్శంగా నిలిచారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఐ రుషీ కేశవను చిత్తూరు వీఆర్ కి అక్కడి నుంచి కర్నూల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కి బదిలీ చేశారు.కాగా రెండు రోజులుగా రుషీ కేశవ తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతూ హైదరాబాదులోని కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారని..ఆస్పత్రి బెడ్ పై ఉన్న ఆయన ఫోటో సోషల్ మీడియాలో షేర్ అయ్యింది.
ఈ పోస్టింగ్ చూసిన చిత్తూరు జిల్లా ప్రజలు అసలు సీఐ రుషీ కేశవకు ఏమైందని ఆరాతీస్తున్నారు. ఇక్కడ పనిచేసే సమయంలో ఎంతో ఉత్సాహంగా కనిపించిన ఆయన ఉన్నట్టుండి హాస్పిటల్లో చికిత్స పొందుతూ కనిపించడంతో ఆయన కోలుకోవాలని జిల్లాలోని ప్రజలు సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతున్నారు. ఇవి ప్రస్తుతం వైరల్ గా మారాయి. అయితే రుషీ కేశవ ఆస్పత్రిలో ఎందుకు చేరారు అనే విషయమై ఇప్పటి కూడా క్లారిటీ రాలేదు. దీంతో చిత్తూరు జిల్లాలోని ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.