• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కోహ్లీకి ఏమైంది? జాతీయ...

కోహ్లీకి ఏమైంది? జాతీయ గీతాలాపన వేళ అలా చేయటమా?

By - Tupaki Desk
Update: 2022-01-24 05:01 GMT
టైం బాగోలేనప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. అయితే.. ఇలాంటివి అందరికి కుదురుతుందేమో కానీ.. విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజ క్రికెటర్ కు వర్తించదని చెప్పొచ్చు. కానీ.. టైం అన్ని సందర్భాల్లో ఒకేలా ఉండదన్నది మర్చిపోకూడదు. గతానికి భిన్నంగా గడిచిన కొద్ది రోజులుగా కోహ్లీకి ఎదురవుతున్న చేదు అనుభవాల వేళలో అయినా.. ఆయన తన తీరును కాసింత మార్చుకుంటే బాగుండేది. అందుకు భిన్నంగా ఆయన వ్యవహరించిన తాజా తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఆయన కెప్టెన్సీ వదులుకోవటం.. ఆటలో ఫాం పోవటంతో పాటు.. గతంలో మాదిరి ఆట ఆడే వేళలో కోహ్లీలో కనిపించే ఫైర్ మిస్ కావటాన్ని పలువురు తప్పు పడుతున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేకు ముందు భారత జాతీయ గీతాలాపన సందర్భంగా టీమిండియా మాజీ కెప్టెన్  విరాట్ కోహ్లీ చేసిన పనిని పలువురు తప్పు పడుతున్నారు. ఆయన్ను అమితంగా అభిమానించే వారు సైతం తాజా చేష్టను జీర్ణించుకోలేకపోతున్నారు. ఓవైపు జాతీయ గీతాలాపన జరుగుతున్న వేళ.. నిర్లక్ష్యంగా చూయింగ్ గమ్ ను నములుతూ ఉన్న వైనం వీడియోలో స్పష్టంగా కనిపించటం.. దీనికి సంబంధించిన క్లిప్ ఒకటి ఆన్ లైన్ లో వైరల్ గా మారింది.

మిగిలిన విషయాల్లో ఎలా ఉన్నా.. విరాట్ కోహ్లీ.. దేశం పట్ల అమితమైన గౌరవం ఉందన్న మాట వినిపిస్తూ ఉంటుంది. అలాంటి ఆయన.. తన తీరుకు ఏ మాత్రం సంబంధం లేకుండా వ్యవహరించిన తీరును పలువురు తప్పు పడుతున్నారు. జాతీయ గీతాలాపన వేళ ఒళ్లు దగ్గర పెట్టుకొని ప్రవర్తించాలని.. కోహ్లీ నుంచి ఈ తరహా అనుచిత ప్రవర్తనను తాము ఊహించలేదంటూ కామెంట్లు చేయటం తెలిసిందే.

ఆయన తీరుకు తీవ్రంగా హర్ట్ అయిన పలువురు అభిమానులు.. జాతీయ జట్టుకు ఆడటం అంత ఇంట్రస్ట్ లేకుంటే.. ఆడటం మానేయాలని హితవు పలుకుతున్నారు. మొత్తంగా ఇప్పటికే బీసీసీఐతో కోహ్లీకి ఉన్న పంచాయితీ ఒక కొలిక్కి రాక ముందే.. ఇప్పుడీ వివాదంలో కూరుకుపోవటం ఏ మాత్రం సరైంది కాదంటున్నారు. ప్రజల ఎమోషన్ ను ఇట్టే టచ్ చేసే అంశంలో కోహ్లీ చేయకూడని తప్పు చేశారన్న మాట వినిపిస్తోంది. దీనికి ఆయన వెంటనే తన దైన స్పందనను తెలియజేస్తే.. ఈ ఇష్యూ ఇక్కడితో ఆగిపోతుంది. కోహ్లీ మరేం చేస్తారో చూడాలి.







Full View



Tags:    
  • viratkohli 
  • nationalanthem 
  • bcci 
  • politicalnews 
  • telugunews 
  • tupakiupdates 

Similar News

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

Copyright @2026

Powered by Blink CMS