పెట్టుబ‌డుల్లో బాబుకు ఈ సీఎం గ‌ట్టి పోటీ

Update: 2017-01-22 06:11 GMT
గ‌త ఏడాది సీఐఐ స‌మ్మిట్ పేరుతో మూడు రోజుల పాటు కార్య‌క్ర‌మాలు చేప‌ట్టి సుమారు ఐదు ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డుల‌కు సంబంధించిన ఎంఓయూలు కుదుర్చుకున్న‌ట్లు ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే పశ్చిమ బెంగాల్ నిర్వహించిన రెండు రోజుల బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సదస్సులో వ్యాపార, పారిశ్రామిక రంగాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులకు హామీ లభించింద‌ని ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జీ ప్ర‌క‌టించారు. 2.35 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయ‌ని మ‌మ‌త వివ‌రించారు. రెండ్రోజుల పాటు జ‌రిగిన స‌ద‌స్సులో వ‌చ్చిన‌ పెట్టుబడుల వివరాలను రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు.

తయారీ రంగంలో చైనా 61,765 కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టేందుకు ముందుకొచ్చిందని మ‌మ‌తాబెన‌ర్జీ చెప్పారు. కాగా, సూక్ష్మ - చిన్న - మధ్యతరహా సంస్థల (ఎమ్‌ ఎస్‌ ఎమ్‌ ఇ) రంగం 50,710 కోట్ల రూపాయల పెట్టుబడులను - పట్టణాభివృద్ధి 46,600 కోట్ల రూపాయల పెట్టుబడులు - రవాణా 38,810 కోట్ల రూపాయల పెట్టుబడులు ఇలా మొత్తం అన్ని రంగాల తరఫున రాష్ట్రంలో 2.35 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను సమీప భవిష్యత్తులో పెట్టేందుకు దేశ - విదేశీ వ్యాపార - పారిశ్రామిక సంస్థలు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాయని మ‌మ‌తాబెన‌ర్జీ చెప్పారు. గత రెండు బిజినెస్ సదస్సుల్లో 4.93 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల ప్రతిపాదనలు అందుకున్నామని పేర్కొన్నారు. గతంలో పాలించిన వామపక్ష ప్రభుత్వాలు బెంగాల్‌ను వ్యాపారానికి దూరం చేశాయని, అయితే తమ హయాంలో వ్యాపార - పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని మమత ఈ సందర్భంగా తెలిపారు. బెంగాల్ ఎప్పుడూ మదుపరులను ఆహ్వానిస్తూనే ఉంటుందని, అన్ని వసతులను కల్పిస్తామని స్పష్టం చేశారు. రాబోయే కాలంలో బెంగాల్ ఎఫ్‌ ఎమ్‌ సిజి రంగంలో 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టనున్నట్లు ఆర్‌ పి సంజీవ్ గోయెంకా గ్రూప్ చైర్మన్ సంజీవ్ గోయెంకా ప్రకటించారు. భారతీ ఎంటర్‌ ప్రైజెస్ కూడా వచ్చే 2-3 ఏళ్లలో 3,000-4,000 కోట్ల రూపాయల పెట్టుబడులను పెడుతున్నట్లు ప్రకటించింది. ఫ్యూచర్ గ్రూప్ సిఇఒ కిశోర్ బియాని - హీరో గ్రూప్ సిఎండి పంకజ్ ముంజల్ సైతం బెంగాల్‌లో తమ భవిష్యత్ వ్యాపార కార్యకలాపాలను వివరించారు.

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీపై ఘాటుగా విరుచుకుపడుతున్న‌ప్ప‌టికీ, రెండ్రోజుల పాటు స‌ద‌స్సు నిర్వ‌హించ‌డం ద్వారానే 2.35ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డులు సంపాదించ‌డం మ‌మ‌తా ప‌రిపాల‌న‌కు నిద‌ర్శ‌నం అంటున్నారు. సీనియ‌ర్ రాజ‌కీయవేత్త‌, కేంద్రంతో స‌న్నిహిత్యం నెరుపుతున్న ఏపీ సీఎం చంద్ర‌బాబు ఈ విష‌యంలో మ‌మ‌తను ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News