టిడ్కో ఇళ్ల కు రూపు తెచ్చింది మేమే - మంత్రి సురేష్

Update: 2023-05-26 11:08 GMT
ఏపీలో గ‌త ప్ర‌భుత్వం నిర్మించిన పేద‌ల ఇళ్లు.. టిడ్కో నివాసాల‌ ను ల‌బ్ధి దారుల‌ కు పంచ‌డం పై మ‌డ‌త పేచీ పెట్టుకున్న వైసీపీ స‌ర్కారు.. తాజాగా ప్ర‌తిప‌క్షం టీడీపీ కి స‌వాళ్లు పంచ‌డం వివాదంగా మారింది. టిడ్కో గృహ సముదాయాల్లో అన్ని మౌలిక వసతులు కల్పించి లబ్దిదారులకు పంపిణి చేస్తున్నట్లు పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. అయితే.. ఎవ‌రికి పంచారో మాత్రం ఆయ‌న చెప్ప‌లేదు.

అయితే, అదే స‌మ‌యంలో టిడ్కో ఇళ్ల పై ఎవరి హయాంలో ఏం చేశారో చర్చించేందుకు సిద్ధమని విపక్షాల కు పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సవాల్‌ విసిరారు. టిడ్కో గృహ సముదాయాల్లో అన్ని మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారుల కు పంపిణి చేస్తున్నట్లు తెలిపారు. రాజధాని పరిధిలోని కృష్ణాయపాలెంలో టిడ్కో ఇళ్ల ను ఆయన  పరిశీలించారు. అమరావతి పరిధిలోని 8 ప్రాంతాల్లో 5వేల గృహాల్ని నిర్మించినట్లు మంత్రి అదిమూలపు వెల్లడించారు.

వీటిలో సింగిల్ బెడ్ రూం ఇళ్ల ను కేవలం రూపాయికే లబ్దిదారులకు అందిస్తున్నట్లు చెప్పారు.  ఈనెల 26(శుక్ర‌వారం)న పేదలకు ఇళ్ల స్థలాల పంపిణితో పాటుగా... రాజధానిలోని టిడ్కో లబ్ధిదారులకు గృహాల్ని అందజేస్తామని స్పష్టం చేశారు.

తెలుగుదేశం పార్టీ  హయంలో టిడ్కో గృహాల నిర్మాణం జరిగినప్పటికీ, వాటికి మౌలిక సదుపాయాలేవీ కల్పించలేదన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాకే వాటి రూపు రేఖలు మార్చి పూర్తిస్థాయిలో సిద్ధం చేసినట్లు వివరించారు. టిడ్కో ఇళ్ల పై ఎవరి హయాంలో ఏం చేశామో చర్చకు సిద్ధమని స‌వాల్ రువ్వారు. మ‌రి దీని పై టీడీపీ నేత‌లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Similar News