తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కరొక్కరుగా మొదలుపెట్టి మొత్తం టీఆరెస్ లోకి చేరుతుండడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆపార్టీ అధినేత చంద్రబాబుకు ఏపీలోనూ పార్టీ నేతల మధ్య లుకలుకలు తలనొప్పిగా మారాయి. విజయవాడ రామవరప్పాడు జాతీయ రహదారి పక్కన ఆక్రమణలు తొలగిస్తున్న సందర్భంలో రాస్తారోకో చేస్తున్న బాధితులను శాంతింపచేయడానికి వచ్చిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పోలీసులు కేసు నమోదు చేయడం ఇప్పుడు టిడిపిలో చర్చనీయాంశమైంది. ఈ కేసుతో నేతల మధ్య విభేదాలు మరోసారి తెరమీదకు వచ్చాయి. దీని వెనుక కృష్ణా జిల్లాకు చెందిన మంత్రి దేవినేని హస్త ముందని పార్టీలోనే వంశీ అనుకూలురు భావిస్తున్నారు. తన ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకే ఎమ్మెల్యేను కేసులో ఇరికించారంట్నున్నారు.
కాగా రాజధాని ప్రాంతంలో ఇతర నేతల మధ్య విభేదాలు కూడా పార్టీ పటిష్టతను దెబ్బతీసే విధంగా ఉన్నాయని నిఘా విభాగం ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. పోలవరం కాల్వ నీటిని - కట్ట మట్టిని గన్నవరం నియోజకవర్గ రైతులు వినియోగించుకునే విషయంలో ఎమ్మెల్యే వంశీకి మంత్రి దేవినేనికి మధ్య ఉన్న విభేదాలున్న విషయం విదితమే. దుర్గగుడి ఫ్లైవోవర్ విషయంలో ఎంపీ కేశినేని నాని పడిన కష్టాన్ని తక్కువ చేసే విధంగా మంత్రి ఉమా వ్యవహరించారనేది కేశినేని అనుయాయుల ఆందోళన. ఆ ఫైవోవర్ శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్ల విషయంలో కూడా ఎమ్ పి కేశినేనికి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు మధ్య రాద్ధాంతమే సాగింది. కాల్ మనీ కేసులో బుద్ధా సోదరుడిపై కేసు నమోదుకు ఆ మంత్రి కారణమనే అనుమా నాలూ అప్పట్లో వ్యక్తమయ్యాయి. ఆ మంత్రి తనకు సంబంధంలేని శాఖ వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకుంటున్నారం టున్నారు. కాపులకు రిజర్వేషన్ల హామీ - బీసీల ఆందోళన - అరకొర రుణమాఫీ - ఎస్సీలపై సిఎం వ్యాఖ్యలు వంటి వాటితో పార్టీ ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఇక్కడ పెద్ద ఎత్తున బిసిలకు రెండో విడత రుణ మేళాను ముఖ్యమంత్రి ప్రారంభించారు. గుంటూరు జిల్లా లోని నరసరావుపేట ఎమ్ పి రాయపాటి సాంబశివ రావు, సీమలో జెసి దివాకరరెడ్డి అప్పుడప్పుడూ చేసే మెరుపు వ్యాఖ్యలు, కాపులకు ఉప ముఖ్యమంతి ఇచ్చినా ఆ వర్గానికి ఇచ్చిన హామీల అమలు విషయంలో ఇటీవల పెల్లుబికిన అసంతప్తి.. ఇలా అన్నీ చంద్రబాబునూ ఆలోచనలో పడేశాయంటు న్నారు. అందుకే పార్టీని పట్టిష్టం చేయాలని, పథకాలకు ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించి ఆదిశగా చంద్రబాబు ఇటీవల పార్టీ ముఖ్యులు, మంతులతో ఇటీవల ఒక సమావేశం కూడా నిర్వహించారని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.