పేకాటరాయుళ్లకి కరోనా పాజిటివ్ .. ఆందోళనలో కుటుంబ సభ్యులు !

Update: 2020-07-15 01:30 GMT
ఏపీలో కరోనా చాలా వేగంగా విజృంభిస్తుంది. ఏమాత్రం అజాగ్రత్త వహించిన కూడా కరోనా భారిన పడక తప్పదు. రోజురోజుకి కరోనా భాదితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అలాగే మరణాల సంఖ్య కూడా రోజురోజుకి పెరిగిపోతుంది. అయితే , రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో కూడా కొందరు తమ వ్యసనాన్ని వదులుకోలేక ..బయటకి వెళ్లి కరోనా కోరల్లో చిక్కుకుపోయారు. ప్రకాశం జిల్లాలో తాజాగా కొంతమంది పేకాట రాయుళ్లకి కరోనా సోకినట్లు తేలింది.

ప్రకాశం జిల్లాని అద్దంకి, కొరిశపాడు, ఒంగోలు, మద్దిపాడు, నాగులుప్పలపాడు మండలకు చెందిన కొంతమంది పేకాటరాయుళ్లు మద్దిపాడు మండలంలోని ఓ రహస్య ప్రదేశంలో 20 మంది వరకు పేకాట ఆడుతుంటారు. గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారం అక్కడ చాలా కాలంగా కొనసాగుతుండగా ప్రస్తుతం లాక్ డౌన్ ఉండటంతో మరింత సమయం అక్కడే గడిపేస్తున్నారు. అయితే వీరిలో పలువురికి కరోనా లక్షణాలు కనిపించడంతో .. వారు కరోనా టెస్ట్ చేయించుకోగా వారికీ పాజిటివ్ గా తేలింది. దీనితో మిగిలిన పేకాటరాయుళ్లలో , అలాగే వారి కుటుంబ సభ్యుల్లో కరోనా కలవరం మొదలైంది.

కాగా , ఏపీలో గడిచిన 24 గంటల్లో మరో 1916 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 33,019కి చేరింది. అలాగే ఇప్పటివరకు కరోనా నుండి రికవరీ అయిన వారి సంఖ్య 17,467కు చేరింది. అలాగే 24 గంటల్లో అత్యధికంగా 43 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 408కు చేరింది. ప్రస్తుతం ఏపీలో 15,144 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Tags:    

Similar News